KCR vs Bandi: హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కేంద్ర బిందువైంది. అక్కడ టీఆర్‌ఎస్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్ తక్కువ అంచనా వేయడం, మూకుమ్మడి మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారం, ఈటల వ్యక్తిగత ప్రాభల్యం అక్కడ టీఆర్‌ఎస్ ఓటమికి ముఖ్య కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ గెలుపు అనంతరం కేసీఆర్ వరుస ప్రెస్‌మీట్లను చూస్తే ఎక్కడో బీజేపీ అంటే భయం మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ లేఖలను చూపుతూ బీజేపీని ఎండగడుతున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్‌ను బీజేపీ క్యాష్ చేసుకునేందుకు చూస్తోంది.

ఈ రెండు పార్టీల చిత్తశుద్ధిని ప్రజలు సంశయించాల్సిందే. కేసీఆర్ నిజంగా ధాన్యం కొనుగోళ్ల గురించే మాట్లాడాల్సి వస్తే ఎన్నికలకు మునుపే ఈ లేఖలను బహిర్గతం చేయాల్సింది. కానీ ఢిల్లీ వెళ్లి మంత్రులను కలిసొచ్చాక సైలెంట్‌గానే ఉన్నారు. ఉప ఎన్నిక ఫలితాల్లో చేదు అనుభవం ఎదురయ్యాక రాష్ట్ర బీజేపీని, బండి సంజరుని దునుమాడుతూ ప్రెస్‌మీట్లు పెట్టారు. అలాగే బీజేపీ కూడా ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొంటుందని అధికారిక ప్రకటన చేయలేకపోయింది. కేవలం పొలిటికల్ పోలరైజేషన్ కోసమే ప్రాకులాడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: BJP Pic Of The Day: దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులంతా ఇలా ఒక్కచోట..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర ధరల పెరుగుదల, కరోనా కేసులు, రైతుల ధాన్యం కొనుగోళ్లు ఇలా అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. చిత్తశుద్ధితో పని చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని ధరలు పెరుగుతున్నా, ప్రజలపై భారాలు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ డీలా పడిపోయింది. రాష్ట్రంలో కేసీఆర్ మీద, ఆయన ప్రభుత్వ తీరు మీద కోపంతో ఉన్న ప్రజలు ధీటైన ఫలితాన్నిచ్చారు. దీంతో ఆ రెండు పార్టీలు డైలామాలో పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర పడిపోయినా ఇక్కడ రేట్లు తగ్గించకుండా పెంచుకుంటూ పోయిన బీజేపీ అకస్మాత్తుగా ఇటీవల పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రంలోనూ కేసీఆర్‌కు టక్కున ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారు. పంట అంతా వేసి ధాన్యం చేతికొచ్చాక కేంద్రం కొనదట.. రాష్ట్ర పరిధిలోని అంశం కాదని వల్లేవేస్తున్నారు. పంట వేసేటప్పుడే క్లారిటీ ఇస్తే రైతు ఏం పండించాలో అర్థం చేసుకుంటాడు. కానీ కేసీఆర్ అలా చేయలేదు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజలకు ఆ పార్టీల వ్యవహర శైలి అర్థమైంది కాబట్టి ఆ రెండు పార్టీలను ఓడించారు. ఇప్పుడు చేసేదేమీ లేక ప్రజల దృష్టి మరల్చేందుకు పొలిటికల్ పొలరైజేషన్ తెరలేపారు. మీది తప్పంటే మీది తప్పని ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.
Also Read: KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?