Laalo Krishna Sada Sahaayate: ప్రస్తుతం ఇండియన్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇక ఇక్కడ స్టార్ హీరోల సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ కంటెంట్ బేస్డ్ సినిమాలకి ఇప్పుడు ఆదరణ దక్కుతుందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇక స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో సినిమాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. తప్ప చిన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం మాత్రం ఎవ్వరు చేయడం లేదు… రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి సూపర్ సక్సెస్ చేస్తున్నారు. కానీ గుజరాతీ లాంటి ఒక చిన్న సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమా వచ్చి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుందనే విషయం మనలో చాలామందికి తెలియదు… రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లాల్ -కృష్ణ సదా సహాయతే’ అనే సినిమా కేవలం 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు 75 కోట్ల కలెక్షన్స్ రావటం అనేది మామూలు విషయం కాదు. మొదటి వారం సినిమాకి 26 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అయినప్పటికి భారీ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది. మన దగ్గర ఈవెంట్స్ కే కోట్లలో డబ్బులు ఖర్చు చేస్తుంటే, అంత బడ్జెట్ లో సినిమా చేసి చాలా గొప్ప పని చేశాడంటు చాలామంది అతన్ని మెచ్చుకుంటున్నారు. 50 లక్షల్లో సినిమా తీయడం ఏంటి అది 75 కోట్లు కలెక్షన్స్ రాబట్టడమేంటి అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరో రెండు రోజుల్లో ఆ కలెక్షన్స్ 100 కోట్లు దాటబోతున్నట్టుగా తెలుస్తున్నాయి…నిజానికి సినిమా అంటే ఏంటి వందల కోట్ల బడ్జెట్ ను పెట్టి భారీ కలెక్షన్స్ ని రాబట్టి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి ప్రొడ్యూసర్ కి ఓ 100 కోట్లు, 200 కోట్లు లాభాలను సంపాదించి పెట్టడమా? లేదంటే 50 లక్షల్లో సినిమాను తీసి 100 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించి ప్రశంశలు అందుకోవడమా అనేది తెలుసుకోవాలి…
కథ ను బట్టి బడ్జెట్ ను కేటాయించుకుంటూ వెళ్ళాలి. అంతే కానీ మన దర్శకులు కథతో సంబంధం లేకుండా బడ్జెట్ ను భారీగా పెంచుకుంటూ సినిమాలను చేస్తే వర్కౌట్ కాదు. దీనివల్ల రియాల్టీ అనేది సినిమాల్లో కనిపించకుండా పోతోంది. అందుకే పెద్ద హీరోల సినిమాలన్నీ రియాల్టీ కి దూరంగా ఉంటున్నాయి.
ఎప్పుడైతే ఒక మనిషి యొక్క బాధలు, ఇష్టాలు,బంధాలు, బంధుత్వాలను కలుపుతూ సినిమాలను స్క్రీన్ మీద చూపించినప్పుడు మాత్రమే వాటికి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అవి రియాల్టీకి దగ్గరగా ఉంటాయి. అలా కాకుండా ఫిక్షన్ కథలను సృష్టించి అది ప్రేక్షకుడిని ఓన్ చేసుకోమంటే వాడు ఎలా చేసుకుంటాడు.
అందుకే మాయలు, మంత్రాలు, హంగులు ఆర్భాటాలు లేకుండా సినిమాలు చేయగలిగిన రోజు వచ్చినప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి నష్టాలు తప్పవని చాలామంది సినిమా మేధావులు చెబుతుండడం విశేషం…ఇక ఇప్పటికైనా ‘లాల్’ అనే గుజరాతీ మూవీని చూసైన ఎలాంటి సినిమాలు తీయాలో మన దర్శకులు తెలుసుకుంటే మంచింది…