Andhra King Taluka USA Review: ప్రతివారం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. మరి కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారుతుంటాయి. ఇక ఎనర్జీటిక్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నా రామ్ పోతినేని సైతం గత కొన్ని రోజులుగా సక్సెసులు లేక సతమవుతున్నాడు. ఇక దాంతో ఇప్పుడు ఆయన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్ లో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈరోజు యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఉపేంద్ర అభిమాని అయిన రామ్ హీరో మీద ఉన్న ఇష్టంతో తన కెరీర్ ని పక్కన పెట్టేసి హీరోని అభిమానించడమే పనిగా పెట్టుకుంటాడు. దాంతో తన లైఫ్ లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోలేక పోతాడు. దాంతో హీరో వచ్చి తన అభిమానిని ఆదుకున్నాడా? లేదా అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది…
ఈ సినిమాలో అభిమాని గా రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ను చూపించినట్టుగా తెలుస్తోంది. అలాగే దర్శకుడు సైతం ఈ సినిమాను హంగులు ఆర్భాటాలు లేకుండా కథకు ఏం కావాలో దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రేక్షకులు కూడా కందిరీగ లో కనిపించిన రామ్ ఎనర్జీని ఈ సినిమాలో చూసామంటూ చాలా గర్వంగా చెబుతుండడం విశేషం…
అలాగే దర్శకుడు మహేష్ బాబు సైతం రామ్ ని చాలా చక్కగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా తనని తక్కువ చేసి చూపించలేదు. అలాగే తను పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో స్క్రీన్ మీద దాన్నే చూపించే ప్రయత్నం చేశాడు. మహేష్ డైరెక్షన్ కూడా చాలా బాగుందట. ఇక మ్యూజిక్ గాని విజువల్స్ అన్ని టాప్ నాచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక యూఎస్ఏ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం అనేది కొంతవరకు శుభ పరిణామం అనే చెప్పాలి. ఇక రామ్ సినిమాలకి చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ టాక్ వచ్చిందంటూ యూఎస్ఏ లో ఉన్న అతని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
