Pawan Kalyan And Balakrishna: చిరంజీవి లాంటి స్టార్ హీరోకి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాన్ని సాధించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకునేలా చేశాయి… ప్రస్తుతం ఆయనకి ఇండియాలో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా 7 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కుతోంది. అలాగే తన పేరు చెప్పుకొని చాలా మంది ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతున్నారనే విషయం మనకు తెలిసిందే…ఇక నందమూరి నటి సింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో టాప్ పొజిషన్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.
వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న ఆయన ఇప్పుడు ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ‘అఖండ 2’ సినిమాని రెడీ చేస్తున్నాడు… ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ ఇద్దరు కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి బాలయ్య బాబులో ఒక విషయం అంటే చాలా ఇష్టమట.
అది ఏంటి అంటే బాలయ్య ఏది ఉన్న చాలా స్ట్రైట్ గా మాట్లాడుతారని లోపల ఒకటి బయటికి మరోటి మాట్లాడే రకం కాదని అందుకే బాలయ్య బాబు అంటే తనకు చాలా ఇష్టమని పవన్ తెలియజేశాడు. అలాగే బాలయ్యకి తెలుగు అంటే చాలా ఇష్టం.. దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చాలా వరకు కృషి చేస్తున్నాడట.
ఎప్పుడైనా ఆయన ఏ ఈవెంట్ కి వచ్చినప్పుడైనా సరే తెలుగు పద్యాలు, రామాయణం, మహా భారతం గురించి చెబుతూ ఉంటాడని, దానివల్ల కూడా బాలయ్య మీద రెస్పెక్ట్ పెరిగిందని పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం… ప్రేక్షకులు సైతం వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడడానికి రెడీగా ఉన్నారు. ఇక తొందర్లో వీళ్ళ కాంబోలో ఏదైనా సినిమా వచ్చే అవకాశాలున్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…