Kushi Collections: మహానటి సావిత్రి కి పుట్టినిల్లు ఆంధ్ర ప్రదేశ్.. మెట్టినిల్లు తమిళనాడు అయితే.. మన ప్రస్తుత హీరోయిన్ సమంత కి మాత్రం పుట్టినిల్లు తమిళనాడు.. మెట్టినిల్లు ఆంధ్ర ప్రదేశ్. అయితే ఈ హీరోయిన్ ఎప్పుడో నాగచైతన్య కి విడాకులు ఇచ్చేసిందనుకోండి. కాగా ఇప్పుడు ఈ హీరోయిన్ నటించిన సినిమా తన పుట్టినిల్లు ఆయన తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
సమంత, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1 విడుదలైన సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ కి కష్టపడుతూ ఉంటే తమిళనాడులో హిట్ టాక్ తెచ్చుకొని అప్పుడే బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. తమిళనాడులో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మన తెలుగు చిత్రం ఖుషి నిలిచింది. ఈ సినిమా తమిళనాట ఇప్పటివరకూ రూ. 7 కోట్లు వసూలు చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తమిళనాడులో ఈ ఏడాది TFI నుంచి 7 కోట్ల రూపాయలతో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు.కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ సినిమా జోరు కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి.
అంతేకాదు సమంత కూడా తన ఇంస్టాగ్రామ్ లో.. ‘లవ్ ఫ్రొం హోమ్ టౌన్’ అని తమిళనాడు కలెక్షన్స్ ని షేర్ చేయడం విశేషం.
ఇక యూఎస్‌లో ఇప్పటికే ఈ సినిమా కాసుల పంట పండించింది. ప్రీమియర్స్‌తో కలుపుకుని తొలి మూడు రోజుల్లోనే యూఎస్‌లో ‘ఖుషి’ సినిమా 1.4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే రూ.11.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది.
ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ, లక్ష్మి, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.