South Africa Vs Australia: ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా వరుస విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటికే జరిగినటువంటి మూడు టి20 సిరీస్ లను క్లీన్ స్వీట్ చేసిన ఆసీస్ జట్టు వన్డే సిరీస్ లో కూడా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కంకషన్ సబ్‌స్టిట్యూట్ మార్నస్ లబుషేన్(93 బంతుల్లో 8 ఫోర్లతో 80 నాటౌట్), అష్టన్ అగర్(69 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 48) కారణంగా మూడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది.
తొలుత బౌలింగ్ తీసుకున్న ఆసీస్ టీం బౌలర్లు కూడా మ్యాచ్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.జోష్ హజెల్ వుడ్(3/41) మూడు వికెట్లు తీయగా.. మార్కో స్టోయినిస్(2/20) రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరితో పాటుగా సీన్ అబాట్, అష్టన్ అగర్, ఆడమ్ జంపా, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. 113 పరుగులు పూర్తికాకముందే ఏడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
సౌత్ ఆఫ్రికన్ బౌలర్లు ఎంతో కట్టడిగా వేసిన
బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు బాల్ ను బౌండరీ దాటించడం మానేసి పెవిలియన్ వైపు వరుసగా పరుగులు పెట్టారు.మిచెల్ మార్ష్(17), జోష్ ఇంగ్లీస్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినీస్(17), సీన్ అబాట్(9) లాంటి ప్లేయర్స్ కూడా దారుణంగా విఫలమయ్యారు. క్రిజ్ లో పాతుకుపోతాడు అనుకున్న కామెరూన్ గ్రీన్(0) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఇక దీంతో ఆసీస్ కు ఈ మ్యాచ్లో పరాజయం తప్పదని…ఇప్పటివరకు కొనసాగుతున్న విజయపరంపరకు బ్రేక్ పడిందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తీవ్రంగా గాయపడిన కామెరూన్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన మార్నస్ లబుషేన్…తన బ్యాట్ కు బాగా పని చెప్పాడు. దాంతో అప్పటి వరకు తడబడుతున్న ఆసీస్ స్కోర్ బోర్డ్ పరుగులు తీయడం మొదలుపెట్టింది. క్రిజ్ లో ఉన్న ఎవరైనా క్రికెటర్ బలమైన గాయం తగిలితే…అతని బదులుగా…అతని సామర్థ్యానికి సరిపడే ఆటగాడిని బరిలోకి దింపడమే..కంకషన్ సబ్‌స్టిట్యూడ్.
ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగ్గిన మార్నస్…అష్టన్ అగర్‌తో కలిసి పరుగుల వరద పారించాడు. వీళ్ళిద్దరి పార్టనర్ షిప్ లో అసలు సిసలు వన్డే బ్యాటింగ్ జరిగిందా అన్న భ్రమ కలిగింది. అప్పటికి చేయాల్సిన పరుగుల కంటే ఓవర్లు ఎక్కువగా ఉన్నాయి.. కాబట్టి తొందరపడి భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ…సరదాగా పరుగులు చేశారు.
మార్నస్ క్రిజ్ లో బాధకు పోవడంతో అప్పటివరకు గెలుపు ఖాయం అనుకున్న సౌత్ ఆఫ్రికా కు ఓటమి తప్పలేదు. పాపం సౌత్ ఆఫ్రికా తరఫున కెప్టెన్ టెంబా బవుమా చేసిన భారీ సెంచరీ వృథా అయ్యింది. అంతా అనుకూలంగా జరిగే సమయానికి మార్నస్ లబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావడం సౌత్ ఆఫ్రికా పై కోలుకోలేని భారంగా మారింది.