https://oktelugu.com/

Kurup Movie Telugu Review : కురుప్ సినిమా రివ్యూ

Kurup Movie Telugu Review: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం కురుప్‌. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించింది. కాగా ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం. రేటింగ్ : 2.75 నటీనటులు : దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు. నిర్మాత : దుల్కర్ సల్మాన్ దర్శకత్వం : శ్రీనాథ్ రాజేంద్రన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 12, 2021 / 03:22 PM IST
    Follow us on

    Kurup Movie Telugu Review

    Kurup Movie Telugu Review: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం కురుప్‌. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటించింది. కాగా ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

    రేటింగ్ : 2.75

    నటీనటులు : దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు.

    నిర్మాత : దుల్కర్ సల్మాన్

    దర్శకత్వం : శ్రీనాథ్ రాజేంద్రన్

    సంగీతం : సుశీన్ శ్యామ్ వి

    విడుదల తేదీ : నవంబర్ 12, 2021

    కథ :

    సినిమా 1960, 70, నుండి నడుస్తూ 2000 సంవత్సరం వరకు జరిగిన సంఘటనలను చూపిస్తుంది.

    గోపి కృష్ణన్ (దుల్కర్ సల్మాన్) ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు. అయితే, అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు కారణంగా పక్కదారి పడతాడు. అలా దారి తప్పిన కురుప్ తెలివిగా క్రైమ్ చేస్తూ చనిపోయినట్టు అందర్నీ నమ్మించి..గోపి కృష్ణన్ నుంచి సుధాకర్ కురుప్ (దుల్కర్ సల్మాన్)గా మారతాడు. ఈ మధ్యలో శారదాంబ (శోభితా ధూళిపాళ)తో ప్రేమ పెళ్లి జరుగుతాయి. మరి సుధాకర్ కురుప్ గా మారిన గోపి కృష్ణన్ మళ్ళీ అలెగ్జాండర్ ఎలా మారాడు ? జీవితంలో ఏదో చేయాలని కల కన్న అతను చివరకు ఏమి సాధించాడు ? అనేది మిగిలిన కథ.

    విశ్లేషణ :

    సాధారణ జీవితం గడపడం ఇష్టం లేని గోపి కృష్ణన్ జీవితంలో ఎదగడానికి ఏమి చేశాడు ? చనిపోయినట్టు అందర్నీ ఎలా నమ్మించగలిగాడు ? లాంటి అంశాలు సినిమాలో అద్భుతంగా చూపించారు. అసలు ఒక సాధారణ వ్యక్తి డబ్బున్న వాడిగా ఎలా మారాడు అనే కోణంలో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక మధ్య మధ్యలో కురుప్ ఎదుర్కొన్న సమస్యలు కూడా సినిమా స్థాయిని పెంచాయి.

    ఇక దుల్కర్ సల్మాన్ నటన చాలా బాగుంది. తనకు మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమా పై దుల్కర్ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అందుకే తెలుగులో దుల్కర్ నే స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాడు. డబ్బింగ్ చెప్పిన విధానం బాగుంది. హీరోయిన్ గా నటించిన శోభితా ధూళిపాళ చాలా బాగా నటించింది.

    ముఖ్య పాత్రలో నటించిన ఇంద్రజిత్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక టెక్నికల్ గా చూసుకున్న ఈ సినిమా మరో మెట్టు పైనే ఉంది. కాకాపోతే ప్లేలో కన్ ఫ్యూజన్ ఉండటం కారణంగా బి.సి ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు.

    ప్లస్ పాయింట్స్ :

    దుల్కర్ సల్మాన్ నటన,

    టేకింగ్, మేకింగ్,

    కథాకథనాలు,

    లవ్ స్టోరీ,

    సాంకేతిక విలువలు

    సెకండ్ హాఫ్

    మైనస్ పాయింట్స్:

    కీలక అంశాలను మిస్ చేయడం,

    అక్కడక్కడ కన్ ఫ్యూజన్ గా ఉండటం,

    ఫస్ట్ హాఫ్

    సినిమా చూడాలా ? వద్దా ?

    భిన్నమైన క్రైమ్ ఎమోషన్స్ తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డార్క్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికీ ఈ చిత్రం అద్భుతం అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లవర్స్ కి మాత్రం ఈ చిత్రం కనెక్ట్ కాదు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎవరైనా ఒకసారి చూడొచ్చు.

    Also Read: ‘పుష్పక విమానం’ రివ్యూ

    ‘రాజా విక్రమార్క’ ఆకట్టుకున్నాడా?.. మూవీ రివ్యూ!

    Tags