https://oktelugu.com/

Chiru: వారిని ప్రోత్సహించడమే నాకున్న బలమైన బలహీనత- చిరు

Chiru: చిత్ర సీమలో కొత్తగా అడుగుపెడుతున్న నటుల్లో కొంచెం టాలెంట్​, వైవిధ్యం కనిపించినా.. వారిని చూసి మురిసి పోయి ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు బెస్ట్ విషెస్​ తెలిపారు చిరు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. https://twitter.com/ActorKartikeya/status/1458836245677625344?s=20 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 12, 2021 / 03:35 PM IST
    Follow us on

    Chiru: చిత్ర సీమలో కొత్తగా అడుగుపెడుతున్న నటుల్లో కొంచెం టాలెంట్​, వైవిధ్యం కనిపించినా.. వారిని చూసి మురిసి పోయి ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు బెస్ట్ విషెస్​ తెలిపారు చిరు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

    https://twitter.com/ActorKartikeya/status/1458836245677625344?s=20

    ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ.. అసలు ఎవరి సాయం లేకుండా.. స్వయంకృషితో ఎదిగిన వాళ్లంటే తనకెంతో అభిమానమని అన్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో ఆ స్వయంకృషి వల్లే తాను కూడా ఎదిగినట్లు తెలిపారు. ఆ తారకమంత్రంతోనే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని అన్నారు. ప్రస్తుతం కెరీర్​లో ముందడుగు వేస్తున్న యంగ్​ హీరో కార్తికేయ అని అన్నారు. తనకు కూడా కార్తికేయ పట్ల సోదరభావం ఉందని తెలిపారు.

    ఈ విధంగా మాట్లాడుతూ.. నాకు చాలా ఇష్టమైన నా సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్‌తో ఇప్పుడు కార్తికేయ సినిమా తీశాడు. ఆ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చాలా బాగున్నాయి.  కార్తికేయ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరు పేర్కొన్నారు. తాజాగా, దీనికి సంబంధించిన వీడియోను కార్తికేయ ట్వీట్‌ చేస్తూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి మంచి సినిమాలు చేస్తానని అన్నారు.