https://oktelugu.com/

Kurchi Madatha Petti Song: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కుర్చీ మడతపెట్టి సాంగ్… అంతా తాత మహిమ!

రామజోగయ్య శాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహేష్ ఫ్యాన్స్ ని ఏకంగా కుక్కలు అనేశాడు. తమన్ మ్యూజిక్ పూర్తి స్థాయిలో మెప్పించలేదనేది వారి వాదన. అయితే మూడో పాటతో విమర్శకుల నోళ్లు మూయించారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2023 / 04:00 PM IST

    Kurchi Madatha Petti Song

    Follow us on

    Kurchi Madatha Petti Song: గుంటూరు కారం చిత్రంపై ఫ్యాన్స్ లో ఎన్నో అనుమానాలు. మొదటి నుండి సినిమా షూటింగ్ సవ్యంగా సాగలేదు. దాంతో అవుట్ ఫుట్ సరిగా వస్తుందా లేదా? సినిమాలో విషయం ఉందా? లేక సోసోగా లాగించేశారా? ఇలా లెక్కకు మించిన సందేహాలు ఉన్నాయి. దానికి తోడు గుంటూరు కారం నుండి విడుదలైన సెకండ్ సాంగ్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. ఈ క్రమంలో ఓ అభిమాని గుంటూరు కారం నిర్మాత, దర్శకుడు, రచయితలను దూషిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

    దీనిపై స్పందించిన రామజోగయ్య శాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహేష్ ఫ్యాన్స్ ని ఏకంగా కుక్కలు అనేశాడు. తమన్ మ్యూజిక్ పూర్తి స్థాయిలో మెప్పించలేదనేది వారి వాదన. అయితే మూడో పాటతో విమర్శకుల నోళ్లు మూయించారు. డిసెంబర్ 30న విడుదల చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

    తమన్ మాస్ బీట్ ఇవ్వగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ పై ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సంచలనాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మూడో సాంగ్ కి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అప్పుడే 9 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇక మహేష్, శ్రీలీల స్టెప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ఒక్క పాట సినిమా మీద అంచనాలు పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    గుంటూరు కారం మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దాదాపు 13 ఏళ్ల అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండనుంది. యాటిట్యూడ్ పీక్స్ లో ఉంటుందని సమాచారం. మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్.