Actor Laxman: జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు. కొందరి జీవితాల్లో జరిగిన పరిణామాలు గమనిస్తే మిరాకిల్ అనిపిస్తుంది. నటుడు లక్ష్మణ్ జీవితంలో కూడా అలాంటి అద్భుతం చోటు చేసుకుంది. టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు లక్ష్మణ్. కాగా లక్ష్మణ్ ఒకప్పుడు గృహ నిర్మాణ కూలీ కావడం అనూహ్య పరిణామం.
ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మణ్ తన వ్యక్తిగత విషయాలు వెల్లడించాడు. ఒరిస్సా రాష్ట్రంలోని గణపతి జిల్లా, రాణి పేటలో జన్మించిన లక్ష్మణ్ పెద్దగా చదువుకోలేదట. పదవ తరగతి అనంతరం చదువు మానేశాడట. చిన్నప్పటి నుండి నటన పట్ల మక్కువ ఉంది. దీంతో నాటకాలు ఆడేవాడు. రంగస్థల నటుడిగా అనేక నాటకాలు ఆడాడు. అవార్డులు గెలుచుకున్నాడు.
రంగస్థలం వలన పెద్దగా డబ్బురాదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. చాలా కాలం పని కోసం వలసలు వెళ్ళాడట. గృహ నిర్మాణ కూలీగా పని చేశాడట. ఆ పనిలో దెబ్బలు తగిలి రక్తం కారేదట. ఒక పని అనేది స్థిరంగా చేసేవాడు కాదట. సినిమా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. లక్ష్మణ్ హీరో అల్లు అర్జున్ ఇంటి నిర్మాణ సమయంలో కూలీగా చేశాడట.
అలాగే ఎస్వీ కేర్ కృష్ణారెడ్డి ఇంటి వద్ద కూడా కూలీగా చేశాడట. లక్ష్మణ్ కో అంటే కోటి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. అనంతరం నగరం నిద్రపోతున్న వేళ, ఆర్ ఎక్స్ 100, వంగవీటి, చెడ్డీ గ్యాంగ్, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. ఆర్ ఎక్స్ 100 మూవీలో లక్ష్మణ్ పల్లెటూరి పద్యాలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఇటీవల విడుదలైన మంగళవారం మూవీలో గుడ్డి వాడి పాత్రలో మెప్పించాడు.