Disposable Cups: మీరు డిస్పోజబుల్ కప్పులు వాడుతున్నారా..? అందులో టీ తాగుతున్నారా? అయితే…!

ప్లాస్టిక్ కప్పులను వాడటం వలన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో పేపర్ కప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. దీంతో ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా పేపర్ కప్పులను ఉపయోగించడం ప్రారంభించారు.

Written By: Suresh, Updated On : December 31, 2023 4:07 pm

Disposable Cups

Follow us on

Disposable Cups: సాధారణంగా ఏదైనా టీ స్టాల్స్ లో కానీ, ఫంక్షన్స్ లో..ఈవెంట్స్ లో కానీ టీ తాగాలంటే డిస్పోజబుల్ కప్పులను వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే రోజూ డిస్పోజబుల్ కప్పులను వాడటం వలన ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని చెప్పుకోవచ్చు. దీని వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

ప్లాస్టిక్ కప్పులను వాడటం వలన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో పేపర్ కప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. దీంతో ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా పేపర్ కప్పులను ఉపయోగించడం ప్రారంభించారు. అయితే ఈ పేపర్ కప్పులలో కూడా ప్లాస్టిక్ ఉంటుందట. ఈ క్రమంలో పేపర్ కప్పులను వినియోగించడం వలన కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఏదో ఒక సందర్భంలో మనమంతా ఒక్కసారైనా డిస్పోజబుల్ కప్పులను వాడే ఉంటాం. ఇటువంటి గ్లాసులలో వాటర్, టీ లేదా కాఫీని తాగుతుంటారు. యూస్ అండ్ త్రో కావడంతో పాటు మార్కెట్ లో సులభంగా దొరుకుతాయి. కానీ వాడటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లోనూ ప్లాస్టిక్ ఉంటుందట. ఈ ప్లాస్టిక్ లో మెట్రోసమైన్, బిస్ఫినాల్ వంటి ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయి. మనం వేడి టీ, కాఫీ తాగినప్పుడు మైక్రోప్లాస్టిక్ కణాలు టీలో కరిగిపోతాయి. అవి టీతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్లాస్టిక్ కణాలన్నీ పేగుల్లో పేరుకుపోయి జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. అంతేకాదు డయేరియా, కిడ్నీ వంటి సమస్యలకు దారి తీస్తుంది.

అలాగే హైడ్రోఫోబిక్ ఫిల్మ్ అనే పొరను కూడా డిస్పోజబుల్ కప్పులను తయారు చేసేందుకు వినియోగిస్తారట. ఇది కూడా ప్లాస్టిక్ తోనే తయారు చేయబడుతుంది. పేపర్ కప్పుల్లో ఉండే రసాయనాల వలన మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు డిస్పోజబుల్ కప్పు లేదా గ్లాస్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిస్పోజబుల్ గ్లాసులను వినియోగించడం తగ్గించాలి, లేదా పూర్తిగా మానేయాలి.