Kuberaa USA Review: శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. క్లాసికల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక తన సినిమా స్టైల్ మార్చుకొని ఇప్పుడు ధనుష్ నాగార్జునతో కలిసి ‘ కుబేర’ (Kubera) అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలైతే వేశారు. మరి ఆ షోలను బట్టి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
Also Read: రాజమౌళి, ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్స్ ఎందుకు తీసుకోరు..?
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే బిజినెస్ మాన్ అయిన నాగార్జున విపరీతంగా డబ్బులను సంపాదించి తన డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక బిచ్చగాడు అయిన ధనుష్ ను తీసుకొచ్చి తన అకౌంట్లోకి డబ్బులు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి అతనితో పాటే ఉంచుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ధనుష్ అనుకోకుండా మిస్ అవుతాడు. ఇక ఈ ప్రాసెస్ లో నాగార్జున ఏం చేశాడు తనను తాను మార్చుకున్నాడా లేదంటే డబ్బే సర్వస్వంగా బతికాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని చూసిన యూఎస్ఏ ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఆశించినంత గొప్పగా ఏమీ లేదని కొన్ని రెగ్యూలర్ సినిమాలను చూసినట్టుగానే ఉందని చెబుతున్నారు… నాగార్జున పాత్రను మలచిన తీరు ఇంతకుముందు కొన్ని సినిమాల్లో ఉన్న బిజినెస్ మాన్స్ ని చూసినట్టుగానే అనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఆయన చేసిన స్కామ్స్ విషయంలో కూడా అవి ఇతర సినిమాల్లో మనం రెగ్యూలర్ గా చూసిన అంశాలే అంటూ చెబుతుండటం విశేషం… ధనుష్ క్యారెక్టర్ లో దర్శకుడు కొంతవరకు వేరియేషన్ ని చూపించే ప్రయత్నం చేసినప్పటికి అక్కడక్కడ బిచ్చగాడు సినిమా గుర్తొస్తుంది అంటూ ఈ మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతూ ఉండటం విశేషం…
ధనుష్ లాంటి మంచి నటుడు ఈ సినిమాకి దొరకడం మంచి విషయమే కానీ దర్శకుడు మాత్రం అతన్ని సరిగ్గా వాడుకోలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా ను స్టార్ట్ చేసిన ప్లాట్ పాయింట్ బాగుంది. మొదటినుంచి మూవీని చాలా ఎంగేజింగ్ నడిపించే ప్రయత్నం చేసిన శేఖర్ కమ్ముల మధ్యలోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా సైడ్ ట్రాక్ వెళ్లిపోయినట్టుగా యూఎస్ఏ ప్రేక్షకులైతే చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే శేఖర్ కమ్ముల గత చిత్రమైన ‘లవ్ స్టోరీ’ (Love Story) క్లైమాక్స్ విషయంలో ఆయన చాలావరకు రాంగ్ స్టెప్ వేశారంటూ చాలా వార్తలైతే వచ్చాయి.
మరి ఈ సినిమా విషయంలో కూడా అలాంటి వార్తలే వస్తుండడం అభిమానులను కొత్త వరకు కలవరపెడుతోంది…ఇక దర్శకుడు రాసుకున్న ప్రతి పాత్ర కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి ఆయా పాత్రలను మధ్యలోనే ఎండ్ చేశారని అందుకే అది ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో కనెక్ట్ అవ్వడం లేదని యూఎస్ఏ ప్రేక్షకుల నుంచి వార్తలైతే వస్తున్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించాడని చెబుతున్నారు… ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ధనుష్ చాలా బాగా నటించి మెప్పించాడనే చెబుతున్నారు. ఇక నాగార్జున సైతం బిజినెస్ మ్యాన్ పాత్రలో చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారట… రష్మిక మందాన కూడా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించినట్టుగా చెబుతున్నారు.
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తె మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయింది…ఈ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులకు నచ్చించిందని చెబుతున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగున్నట్టుగా చెబుతున్నారు…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా కంటెంట్ కి తగ్గట్టుగా బాగా సెట్ అయిందని చెబుతుండటం విశేషం…
ప్లస్ పాయింట్స్
ధనుష్ యాక్టింగ్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
స్లో నరేషన్
రేటింగ్
యుఎస్ఏ ప్రేక్షకులను బట్టి ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5
