Kubera Movie Trailer Review: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) మూవీ మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ టీం మాట్లాడిన మాటలు చూసిన తర్వాత సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థమైంది. ఇదే ఈవెంట్ లో రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాత ఇక ఈ సినిమా ఈ ఏడాదిలోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని ప్రతీ ఒక్కరిలో బలమైన నమ్మకం కలిగింది. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ లో అసలు స్టోరీ ఏమి జరుగుతుందో ఆడియన్స్ కి అర్థం కాలేదు. కానీ ట్రైలర్ ని చూసిన తర్వాత స్టోరీ ఏమిటి అనేది స్పష్టంగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
Also Read: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!
కోటీశ్వరుల వద్ద బ్లాక్ మనీ ని కొట్టేసే పాత్రలో ఇందులో అక్కినేని నాగార్జున కనిపించినట్టు తెలుస్తుంది. రోడ్డు మీద అడ్డుకొని తినే బిచ్చగాళ్ల మాఫియా ని మ్యానేజ్ చేసే ఒక వ్యక్తి వద్దకు వెళ్లి నాగార్జున బిచ్చగాళ్లందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు. వీళ్ళ పేర్ల మీద స్విస్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి బ్లాక్ మనీ ని మొత్తం అందులో పడేలా చేసుకుంటాడు. అలా ధనుష్ పేరిట కూడా ఒక స్విస్ అకౌంట్ ని ఏర్పాటు చేసి వందల కోట్ల బ్లాక్ మనీ ని అతని అకౌంట్ లో పడేలా చేస్తాడు నాగార్జున. ఆ తర్వాత ధనుష్ డబ్బుతో పరారీ అవ్వగా, అతని కోసం నాగార్జున మరియు అతని టీం వెతకడం మొదలు పెడుతారు. చివరికి ధనుష్ నాగార్జున చేతికి దొరుకుతాడా లేదా?, దొరికిన తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది.
హృదయాలను హత్తుకునే సినిమాలు ఎక్కువగా తీసే అలవాటు ఉన్న శేఖర్ కమ్ముల, ఇలాంటి జానర్ తో మన ముందుకు రావడం నిజంగా అందరికీ షాకింగ్ సర్ప్రైజ్ అనే అనుకోవాలి. ఆయన మార్క్ టేకింగ్ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. నటీనటుల నుండి పెర్ఫార్మన్స్ ని రాబట్టడం లో శేఖర్ కమ్ముల ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ సినిమాలో కూడా అటు ధనుష్ నుండి, ఇటు అక్కినేని నాగార్జున నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్నట్టు ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది. ఇందులో నాగార్జున కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసినట్టు అనిపించింది. ఆయన క్యారక్టర్ లో చాలా లేయర్స్ ఉన్నాయి. అదే విధంగా ధనుష్ ని చూస్తుంటే ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు ని కచ్చితంగా కొల్లగొడుతాడని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. థియేటర్స్ కి కదిలేలా మంచి థియేట్రికల్ ట్రైలర్ ని అయితే అందించారు. మరి సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది చూడాలి.