Kubera Telugu vs Tamil collection: నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న కుబేర(Kubera Movie) చిత్రం అప్పుడే బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకొని వారం రోజులైంది. టాలీవుడ్ కి బిజినెస్ లేక డీలా పడిన సమయంలో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లను రాబడుతూ, చాలా కాలం తర్వాత హౌస్ ఫుల్ బోర్డ్స్ కి పని చెప్పింది ఈ చిత్రం. తెలుగు వెర్షన్ వసూళ్లు అద్భుతం, కానీ తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రం దారుణం. ధనుష్(Dhanush) గత చిత్రం తమిళనాడు లో రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లను ‘కుబేర’ చిత్రం మొదటి వారం పూర్తి అయినా రాబట్టలేదు. దీనిని బట్టీ అక్కడి ఆడియన్స్ ఈ సినిమాని ఏ రేంజ్ లో రిజెక్ట్ చేసారో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాము.
తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వారం ఈ చిత్రానికి 30 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 51 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి మరో మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అదే విధంగా తమిళనాడు లో 18 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక నుండి 7 కోట్ల 80 లక్షలు, కేరళ నుండి కోటి 15 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 26 కోట్ల 80 లక్షలు, మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి వారం వరల్డ్ వైడ్ గా 108 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 54 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 11 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.
Also Read: Accident in Kubera Theater: కుబేర థియేటర్ లో ఘోర ప్రమాదం.. పరుగులు తీసిన ఆడియన్స్..వీడియో వైరల్!
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతానికి గానూ మొదటి వారం లో ఈ చిత్రం 13 కోట్ల 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 3 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 84 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 23 లక్షలు, వెస్ట్ గోదావరి లో కోటి 39 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 93 లక్షలు, కృష్ణ జిల్లాలో రెండు కోట్లు, నెల్లూరు జిల్లాలో కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సెకండ్ వీకెండ్ ఈ చిత్రానికి అత్యంత కీలకం కానుంది. చూడాలి మరి ఏ రేంజ్ వరకు వెళ్తుంది అనేది.
#Kuberaa 1st Week Gross – 102 Cr
Highest Grosser For #Nagarjuna
Highest Grosser For #SekharKammula
4th 100 Cr Grosser For #Dhanush
Biggest 1st Week For #Dhanush pic.twitter.com/M8wwbg6yEN— TrackTollywood (@TrackTwood) June 27, 2025