Kuberaa box office collection : కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పైకి లాగిన చిత్రం ‘కుబేర'(Kuberaa Movie). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna),ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వీకెండ్ తర్వాత కూడా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, తమిళనాడు లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవబోతుంది. అద్భుతమైన రేటింగ్స్ ఉన్నాయి, ధనుష్ అందులో హీరో, పైగా మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది, అయినప్పటికీ ఈ చిత్రం తమిళం లో ఆడట్లేదు. అందుకు కారణం ఈ చిత్రాన్ని తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం వల్లే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు.
తమిళనాడు లో ఏ రేంజ్ డిజాస్టర్ అనేది మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాము. విడుదలకు ముందు ఈ సినిమా తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల రూపాయలకు జరిగింది. విడుదలై ఆరు రోజులైంది, ఇప్పటి వరకు ఈ చిత్రానికి కనీసం 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. కేవలం 17 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ వీకెండ్ బాగా కలిసొస్తే మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ తమిళనాడు నుండి అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఇది నిజం అవుతుందా లేదా అనేది. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.
33 కోట్ల రూపాయలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఆరు రోజుల్లో 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి కేవలం ఇక నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే అవసరం ఉంది. రేపు, ఎల్లుండి లోపు బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. ఆ తర్వాత మొత్తం లాభాలే. గ్రాస్ లెక్కలోకి చూస్తే తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 50 కోట్లా రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా ఓవర్సీస్ లో 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక లో 7 కోట్ల 35 లక్షలు, కేరళలో కోటి 10 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల 30 లక్షల రూపాయిలను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు,52 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
#Dhanush recent movie #Kuberaa has crossed 100Cr worldwide in 6 days.
Also features #Nagarjuna and #RashmikaMandanna.
Will it cross 200Cr worldwide??#KuberaaBlockbuster #DhanushsKuberaa100cr pic.twitter.com/Py9RoVGeWu
— Cinema & Cricket (@Durgesh180790) June 25, 2025