Kannappa OTT Release Date: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, ఎన్నో ఏళ్ళు కష్టపడి, తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై పర్లేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. చూసిన ప్రతీ ఒక్కరు సెకండ్ హాఫ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కడా ఒక్క రూపాయికి కూడా అమ్ముడుపోలేదు. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ ని కూడా మంచు విష్ణు అమ్మలేదు. ఇక థియేటర్స్ లో అయితే బయ్యర్స్ అందరికీ కమీషన్ బేసిస్ మీదనే ఈ చిత్రాన్ని ఇచ్చేసాడు. అంటే థియేటర్స్ నుండి వచ్చిన గ్రాస్ ని మాత్రమే షేర్ చేసుకోవడం అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే చాలా డేరింగ్ & డ్యాషింగ్ నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పాలి.
ఎందుకంటే ఈమధ్య కాలం లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఓటీటీ డీల్ లాక్ అయితేనే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఒకవేళ ఓటీటీ డీల్ లాక్ అవ్వకపోతే నెలల తరబడి విడుదలకు నోచుకోవడం లేదు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఓటీటీ ని మంచు విష్ణు తాను కోరిన రేట్ ని ఇవ్వలేదని ఓటీటీ డీల్ ని లాక్ చేయకుండానే విడుదల చేసాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇంతటి డేరింగ్ స్టెప్ తీసుకున్న ఏకైక హీరో మంచు విష్ణు మాత్రమే. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆయన అమెజాన్ ప్రైమ్ సంస్థ కే అమ్మబోతున్నట్టు తెలుస్తుంది. మిగిలిన సినిమాలు లాగా కాకుండా, ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదల చేస్తారట. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. వాస్తవానికి ఇలా చేస్తేనే సినీ ఇండస్ట్రీ బ్రతుకుతుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఇదే సూత్రాన్ని తన సినిమాలకు ఈమధ్య కాలం లో వాడుతున్నాడు. విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ ని అమ్మేది లేదు, విడుదల తర్వాతే అమ్ముతానని బహిరంగంగా చెప్పేసాడు. ఇది ఆయనకు బాగా వర్కౌట్ అయ్యింది. మంచు విష్ణు అనుసరించిన ఈ తీరుని ఇతర టాలీవుడ్ నిర్మాతలు కూడా ఫాలో అయితే కచ్చితంగా ఓటీటీ వల్ల రన్ పై ప్రభావం చూపుతుంది అనే టాక్ భవిష్యత్తులో వినిపించకపోవచ్చు. ఎందుకంటే పలానా ఓటీటీ కి పలానా సినిమా అమ్ముడుపోయింది, నాలుగు వారాల్లో ఓటీటీ లోకి వచేస్తాది, థియేటర్స్ కి వెళ్లడం ఎందుకులే అని ఆలోచించే ప్రేక్షకులు ఉంటారు. అదే ఏ ఓటీటీ లో విడుదల అవ్వబోతున్నది అనేది తెలియకపోతే ఇలాంటి అంచనాలేవి ఉండవు. థియేటర్స్ కి వెళ్లి చూసేందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ‘కన్నప్ప’ చిత్రానికి ఇది బాగా వర్కౌట్ అవ్వొచ్చు.