Kubera OTT views: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush K Raja) కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కమర్షియల్ అనుకున్నంత పెద్ద హిట్ అవ్వలేదు కానీ, హిట్ అని మాత్రం అనిపించుకుంది. అందుకు కారణం తమిళ వెర్షన్ వసూళ్లు అసలు ఏమాత్రం సహకరించకపోవడం వల్లే. ధనుష్ కెరీర్ లో ఒక పెద్ద సూపర్ హిట్ గా తమిళం లో కూడా నిలుస్తుందని అనుకుంటే, ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కేవలం తెలుగు వెర్షన్ నుండి వచ్చిన వసూళ్లతోనే ఈ సినిమా కమర్షియల్ హిట్ అని అనిపించుకుంది. అయితే రీసెంట్ గానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అయ్యింది.
Also Read: స్పిరిట్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందా..? ఫ్యాన్స్ కి పండగేనా..?
ఈ నెల 18 వ తేదీ నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. కేవలం స్టార్ హీరోలకు తప్ప, ఈ రేంజ్ వాచ్ మినిట్స్ ఇప్పటి వరకు సీనియర్ హీరో సినిమాకు రాలేదు. ఆ విధంగా అక్కినేని నాగార్జున ఒక అరుదైన రికార్డుని నెలకొల్పాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా థియేటర్స్ లో చూసే ఆసక్తి లేక బధ్ధగించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్లంతా ఇప్పుడు ఓటీటీ లో చూడొచ్చు. రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ, మంచి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించే సినిమా ఇది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ చిత్రాన్ని చూసేయండి.
Also Read: ఇదేమి మేకోవర్ బాబోయ్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన బుచ్చి బాబు!
ఇక ఈ చిత్రం నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఈ చిత్రం 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందులో తమిళ వెర్షన్ నుండి కేవలం 20 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. మిగిలిన వెర్షన్స్ నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ నుండి అక్షరాలా 105 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో కంటే ఎక్కువగా ఓవర్సీస్,నైజాం ప్రాంతాల్లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అక్కినేని అభిమానులు ఈ సినిమా విజయం పట్ల సంపూర్ణమైన సంతృప్తి తో ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత నాగార్జున మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు అనే ఆనందం వారిలో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎలాంటి వెరైటీ రోల్స్ లో కనిపించబోతున్నాడో చూడాలి.