Mahendragiri Varahi: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమంత్(Sumant)… ‘ప్రేమకథ’ మూవీ తో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సత్యం, గౌరీ, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా, సుబ్రమణ్య పురం లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను సాధించాడు…కథలను ఎంచుకోవడంలో సుమంత్ కి మంచి టేస్ట్ ఉందనే విషయం ఆయన చేసిన సినిమాలను గమనిస్తే మనకు అర్థం అవుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. రీసెంట్ గా ‘అనగనగా’ (Anaganaga) అనే వెబ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని మంచి విజయాన్ని అందుకున్నాడు.
Also Read: మన స్టార్ హీరోల కెరియర్ లో అల్ట్రా డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఇవేనా..?
ప్రస్తుతం ఆయన ‘సుబ్రమణ్య పురం’ (Subramanya Puram) ఫేమ్ ‘సంతోష్ జాగర్లపూడి’ (Santhosh Jagarlapudi) డైరెక్షన్ లో ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendra giri Varahi) అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమాతో తన ఖాతాలోకి మరో సక్సెస్ వచ్చి చేరుతుంది అనే నమ్మకంతో సుమంత్ ఉన్నారు. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి సైతం ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దానికి తగ్గట్టుగానే మహేంద్రగిరి వారాహి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువబోతుంది…
‘రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్’ (Raja Shyamala Entertaiments) బ్యానర్లో మధు కలిపు (Madhu Kalipu) గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ తమ బ్యానర్ నుంచి వచ్చిన ‘రంగమార్తాండా’ సినిమా ఎంత గొప్ప గుర్తింపును సంపాదించుకుందో ‘మహేంద్రగిరి వారాహి’ అంతకంటే మంచి గుర్తింపును సంపాదించుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ పూర్తవ్వగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు… ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. తొందర్లోనే టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నారు.
ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాని రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు… వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఉండబోతున్న ఈ సినిమాని చూడడానికి ఇప్పటికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమంత్ అనగనగా సినిమాలో ఎలాగైతే తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేసాడో ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ ని ఇవ్వబోతున్నారట…అలాగే ఆయన 25 సంవత్సరాల సినీ కెరియర్ లో ఈ సినిమా ఒక గొప్ప మూవీగా నిలువబోతుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…