నేహా శర్మ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
2007లో రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
ఈ తెలుగు సినిమాతనే నటనా జీవితాన్ని ప్రారంభించింది నేహా.
ఇక ఆ తర్వాత 2010లో క్రూక్ అనే హిందీ సినిమాలో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
సెమీ-హిట్ అయిన క్యా సూపర్ కూల్ హై హమ్ అనే సినిమాలో నేహా పాత్రకు మంచి గుర్తింపు సంపాదించుకుంది.
రొమాంటిక్ కామెడీ జోగిర సారా రారాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి.
జోగిర సారా రా రా మే 26, 2023న విడుదలైన హిందీ చిత్రం. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో నేహా శర్మతో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఇక సినిమాలతో మాత్రమే కాదు మంచి ఫోటోలతో కూడా వైరల్ అవుతుంది ఈ బ్యూటీ.