https://oktelugu.com/

Kriti Shetty : కాలంతో ప్రయాణించే కుర్రాడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కృతి శెట్టి..అతనెవరో మీరే చూడండి!

అయితే రీసెంట్ గా ఈమె లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి 'LIC' అనే చిత్రం చేస్తుంది. నయనతార భర్త సతీష్ విఘ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'LIC' అంటే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అని అర్థం. ఈ చిత్రంలో కథానాయకుడు ఒక మొబైల్ గ్యాడ్జెట్ ఉపయోగించి, టైం ట్రావెల్ ద్వారా తన ప్రియురాలిని కలుసుకుంటాడు. కథ వింటుంటే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 07:43 PM IST

    Kriti Shetty and Pradeep Ranganathan

    Follow us on

    Kriti Shetty : ఉప్పెన సినిమాతో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కృతి శెట్టి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితికి వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అవకాశాల కోసం ఈమె ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను తరచూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ‘ఉప్పెన’ చిత్రం తర్వాత ఈమెకి సినిమాల్లో అవకాశాలు ఉప్పెన లాగా తన్నుకొచాయి. కానీ చేతికి వచ్చిన ప్రతీ సినిమా చేస్తే చతికిలపడక తప్పదు అని ఈ అమ్మడుకి చాలా తొందరగానే తెలిసి వచ్చింది. ఉప్పెన చిత్రం తర్వాత ఈమె వరుసగా ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.

    చేతికి వచ్చిన ‘భగవంత్ కేసరి’ లాంటి అద్భుతమైన కథలను వదులుకొని, ఫ్లాప్ చిత్రాలు చేసింది. ఫలితంగా ఈ హీరోయిన్ ని తీసుకుంటే మా సినిమా ఫ్లాప్ అయిపొతుందెమో అనే భయాన్ని ఈమె నిర్మాతలలో కలిగించింది. దాంతో ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే రీసెంట్ గా ఈమె లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి ‘LIC’ అనే చిత్రం చేస్తుంది. నయనతార భర్త సతీష్ విఘ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘LIC’ అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అని అర్థం. ఈ చిత్రంలో కథానాయకుడు ఒక మొబైల్ గ్యాడ్జెట్ ఉపయోగించి, టైం ట్రావెల్ ద్వారా తన ప్రియురాలిని కలుసుకుంటాడు. కథ వింటుంటే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ!.

    సరైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం తీస్తే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రంలో కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ గతం లో ‘లవ్ టుడే’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళం లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు లో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది. అంతే కాదు ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం కూడా ఆయనే. గతం లో ఆయన దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ అనే చిత్రం చేసాడు. డిఫరెంట్ కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. ఇలా ప్రదీప్ ఎంచుకునే ప్రతీ స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగా, నేటి తరం యువతకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్నీ ఇప్పటి వరకు పెద్ద హిట్ అయ్యాయి. అదే విధంగా ఈ ‘LIC’ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ ఈ సినిమా అనుకున్న విధంగా పెద్ద హిట్ అయితే కృతి శెట్టి టైం మళ్ళీ మొదలైనట్టే, ఆమె వయస్సు కేవలం 23 ఏళ్ళు మాత్రమే, కాబట్టి ఆమెకి బోలెడంత కెరీర్ నిర్ణయింపబడేది ఈ చిత్రంతోనే, చూడాలిమరి ఎలా ఉండబోతుందో.