MP Vemireddy Prabhakar Reddy : వేమిరెడ్డిని నెత్తిన పెట్టుకున్న బాబు.. ఇంత గౌరవం దక్కుతుందని అనుకోలేదట!

వైసీపీ ఆవిర్భావం నుంచి చాలామంది నేతలు ఆ పార్టీలో పని చేశారు. కానీ గౌరవంతో పాటు పదవులు దక్కించుకుంది కొందరే. మరికొందరు పార్టీ కోసం కష్టపడినా గౌరవం దక్కలేదు. అటువంటి వారిలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు.

Written By: Dharma, Updated On : August 22, 2024 7:24 pm

Nellore MP Vemireddy Prabhakar Reddy

Follow us on

MP Vemireddy Prabhakar Reddy : రాజకీయాల్లో కొందరు పదవులు ఆశిస్తారు. మరికొందరు గౌరవాన్ని పొందాలని భావిస్తారు. ఇలా రెండోది ఆశించిన వారిలో నెల్లూరి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉంటారు. ఈ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. కానీ ఆ పార్టీలో గౌరవం దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. టిడిపి అతనికి నెల్లూరు ఎంపీ సీటును ఖరారు చేసింది. ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవడమే కాదు.. జిల్లాలో పదికి పది స్థానాలు కూటమికి దక్కేలా చేశారు. కేవలం గౌరవం దక్కకపోవడంతోనే ఆయన పార్టీ మారారు. వైసీపీకి దారుణంగా దెబ్బతీశారు. అయితే వైసీపీకి ఆర్థికంగా వెన్ను దన్ను అందించడంలో వేమిరెడ్డి ముందుండేవారు. పార్టీ ఆవిర్భావం నుంచి మెరుగైన సేవలు అందించేవారు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సముచిత స్థానం ఇచ్చారు. అయితే వేంరెడ్డి ఆశించిన గౌరవం మాత్రం వైసీపీలో దక్కలేదు. అందుకే ఆయన నొచ్చుకున్నారు. వెంటనే పార్టీ మారిపోయారు.

* పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో సభ్యుడిగా
తాజాగా ఆయనకు ఒక పదవి దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో సభ్యుడిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. 15 మంది లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఈ కమిటీని స్పీకర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ పదవిని అప్పట్లో వైసీపీలో ఆశించారు ప్రభాకర్ రెడ్డి. కానీ జగన్ కు ఈ విషయం తెలియనివ్వలేదు. పదవిని కూడా అప్పట్లో కేటాయించలేదు.

* అప్పట్లో వారిదే హవా
వైసిపి హయాంలో ఆ పార్టీకి 23 మంది ఎంపీలు ఉండేవారు. ఆపై రాజ్యసభ సభ్యులు కూడా అధికం. అప్పట్లో విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి హవా నడిచేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక నేత అయినా గుర్తింపు అంతంత మాత్రమే. ఈయన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో సభ్యత్వాన్ని ఆశించారు. అయితే వైసిపి నిరాకరించింది. ఆయన మనస్థాపం చెందారు.ఇప్పుడు అదే పదవి టిడిపిలో సులువుగా లభించడం విశేషం.

* జగన్ పట్టించుకోలేదట
గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు కేంద్రంలో చాలా కమిటీల్లో వైసీపీ ఎంపీలకు స్థానం దక్కింది. అదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను ఆ పదవి ఆశిస్తే దక్కలేదని బాధపడ్డారట. అదే విషయాన్ని ఢిల్లీకి వచ్చిన జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అయితే ఎంత పని జరిగింది.. తనకు తెలియదని.. తెలిసి ఉంటే తప్పకుండా ఆ కమిటీలో సభ్యత్వం ఇప్పించేవాడినని.. అదేం పెద్ద విషయం కాదని తేలిగ్గా మాట్లాడారట. కానీ ఆ కమిటీల్లో నియమించడం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారట. కానీ టిడిపిలో సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డికి.. అదే కమిటీలో చోటు దక్కడం విశేషం. అక్కడ దక్కని గౌరవం ఇక్కడ దక్కిందంటూ ప్రభాకర్ రెడ్డి ఆనందంతో ఉన్నారట.