నాలుగేళ్ల క్రితం అవకాశాలు లేక చిన్నాచితకా యాడ్స్ కూడా చేసి నానా ఇబ్బందులు పడ్డ కృతీ సనన్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. టైమ్ కలిసొస్తే.. అవకాశాలన్నీ అలాగే వస్తాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో మెయిన్ హీరోయిన్ కృతి నటిస్తోంది. కాగా తాజాగా కృతీ మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది.
ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అంటే ఆమె ఖాతాలో ఇది మూడో పాన్ ఇండియా సినిమా అన్నమాట. పైగా ఇది హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ హిందీ రీమేక్. ఈ అవకాశం కోసం అలియా భట్ దగ్గర నుండి కియారా వరకూ అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అవకాశం మాత్రం కృతీకి దక్కింది. ఈ సినిమాలో కృతీ హీరోయిన్ నటించబోతుందనే సరికి ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
అయితే, ఈ సినిమా కృతి రావడానికి కారణం ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ కృతీ మాత్రమే. అందుకే ఈ భారీ క్రేజీ సినిమా ఆమెను వరించింది. క్వెంటిన్ టరంటినో దర్శకత్వంలో రూపొందిన ‘కిల్ బిల్’లో ఉమా థుర్మన్ కథానాయికగా నటించారు. హిందీ రీమేక్‌లో ఆ పాత్రలో కు కృతీ సనన్ నటిస్తోంది.
నిర్మాత నిఖిల్ ద్వివేది నిర్మాణంలో రానున్న ఈ సినిమాని అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించబోతున్నాడు. పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో హంతకులు ‘బిల్’ని, అతని మనుషులనూ చంపడమే ధ్యేయంగా ఇందులో కృతీ పాత్ర సాగుతుందట. మొత్తానికి హంతకుల పై పగబట్టిన భయంకరమైన మహిళగా కృతీ నటించబోతుంది.