https://oktelugu.com/

Krithi Shetty In Prabhas Movie: ప్రభాస్ కోసం ‘కృతి శెట్టి’ స్పెషల్ రోల్ ?

Krithi Shetty In Prabhas Movie: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కి యంగ్ క్రేజీ బ్యూటీ కృతి శెట్టి ప్రేయసిగా నటించబోతుందట. హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో కృతి శెట్టి నటిస్తోందట. ఆమె ఓ ఉన్నతాధికారి కూతురి పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది. కాగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 28, 2022 / 07:14 PM IST
    Follow us on

    Krithi Shetty In Prabhas Movie: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కి యంగ్ క్రేజీ బ్యూటీ కృతి శెట్టి ప్రేయసిగా నటించబోతుందట. హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో కృతి శెట్టి నటిస్తోందట. ఆమె ఓ ఉన్నతాధికారి కూతురి పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది.

    Krithi Shetty

    కాగా ఈ సినిమాలో ఈ ట్రాక్ నాలుగు సీన్స్ లో ముగుస్తోందట. ఇక ‘సలార్‌’ కొత్త షెడ్యూల్‌ లో కృతి శెట్టి పార్ట్ తీయబోతున్నారు. మొత్తానికి కృతి శెట్టి కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయినట్టే. ఇప్పుడిప్పుడే సౌత్ స్టార్ హీరోల సినిమాల్లోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోన్న కృతి శెట్టికి, ఇది గోల్డన్ ఛాన్స్ లాంటిదే. ఇప్పటికే కృతి శెట్టికి ఫుల్ డిమాండ్ ఉంది. వరుస సినిమాలు చేస్తోంది.

    Also Read: MLA Seethakka: దేశాన్ని విడ‌గొట్టేది ఆ సినిమా.. క‌లిపి ఉంచేది ఈ సినిమా.. ఎంతైనా సీత‌క్క స్టైలే వేరు..

    ప్రతి సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, కృతి శెట్టి ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో ‘సలార్‌’ కూడా చేరింది. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అంటూ ఆశగా చూసిన అభిమానులకు ఈ న్యూస్ మంచి కిక్కిచ్చే వార్తే. ఇక ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది.

    ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు స‌లార్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ఆలోచ‌నలో ఉన్నారు. ఒకవేళ రెండు పార్ట్స్ గా తీసుకువస్తే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయి. పైగా రాజమౌళి తర్వాత ఆ స్థాయి మార్కెట్ ఉన్న డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్.

    కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. మరి రెండు పార్ట్స్ గా ఈ సినిమా వస్తోందా ? రాదా ? చూడాలి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇలాంటి సినిమాలో స్పెషల్ రోల్ లో కృతి శెట్టి కనిపిస్తే.. ఆమె కెరీర్ కి అది బాగా ప్లస్ అవుతుంది.

    Also Read: Raj Tarun: బ్యాడ్ టైంలో గొప్ప అవకాశం.. ఫామ్ లోకి వస్తాడా ?

    Recommended Video:

    Tags