https://oktelugu.com/

Alia Bhatt: సూపర్ స్టార్లు కంటే ఎక్కువ సంపాదిస్తున్న హీరోయిన్..? ఎవరు ఆమె ? ఏమిటి కారణం ?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి దేశవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే, అలియాకి ఇన్ స్టాగ్రామ్ లో కూడా భీభత్సమైన పాపులారిటీ దక్కింది. ఆ ఇమేజ్ ను అలియా కూడా బాగానే క్యాష్ చేసుకుంటుంది. ఆమె ఒక్క పోస్ట్ కోసం ఎంత అడుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్న ప్రకారం, అలియా తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ చేయాలంటే, ఏకంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 7, 2022 / 05:37 PM IST
    Follow us on

    Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి దేశవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే, అలియాకి ఇన్ స్టాగ్రామ్ లో కూడా భీభత్సమైన పాపులారిటీ దక్కింది. ఆ ఇమేజ్ ను అలియా కూడా బాగానే క్యాష్ చేసుకుంటుంది. ఆమె ఒక్క పోస్ట్ కోసం ఎంత అడుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్న ప్రకారం, అలియా తన ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ చేయాలంటే, ఏకంగా ఒక్క పోస్ట్ కి ₹85 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తుంది. పైగా ఇది డిమాండ్స్ ను బట్టి ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు. అందుకే.. నెటిజన్లు కూడా అలియా సోషల్ మీడియా సంపాదన గురించి విని, ఆశ్చర్యపోతున్నారు. 2021లో డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం, అలియా బ్రాండ్ విలువ $68.1 మిలియన్లుగా ఉంది. సంపాదన పరంగా చూసుకుంటే.. టాప్ 10లో అలియా అతి పిన్న వయస్కురాలు కూడా. పైగా ఒక్కో పోస్ట్ కి ఇంత భారీ మొత్తం తీసుకున్న ఏకైక ఇండియన్ హీరోయిన్ గా కూడా అలియా భట్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    Alia Bhatt

    నిజానికి షారుక్, సల్మాన్ లాంటి మాస్ హీరోలకు కూడా ఒక్కో పోస్ట్ కోసం ఈ రేంజ్ రెమ్యునరేషన్స్ ఇవ్వట్లేదు. మరి అలియాకే ఎందుకు ఇస్తున్నారు అంటే.. ?, అలియాది నేషనల్ రేంజ్ క్రేజ్. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 68.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అన్నిటికి కంటే ముఖ్యంగా ఆమె ఫాలోవర్స్ లో ఎక్కువమంది చాలా యాక్టివ్ గా ఉన్నారు. దాంతో, కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు అలియా దగ్గరకు వస్తున్నాయి. దాంతో అలియా తన ఇన్‌ స్ట్రాగ్రామ్‌ ను బిజినెస్ వేదికగా మలుచుకుంటూ ఒక్కో పోస్ట్ కి ఇంత అని లెక్క గట్టి మరీ, బాగా డిమాండ్ చేస్తోంది.

    Also Read: Ram Charan- Shankar Movie: చరణ్ సినిమా పై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తిరిగి చెన్నై వెళ్లిపోయిన శంకర్

    రీసెంట్ గానే అలియా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ రేట్లును కూడా రెట్టింపు చేసింది. మొత్తానికి అలియా సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ పెంచుకొని యాడ్స్ పోస్ట్ లతో కూడా ఫుల్ గా సంపాదిస్తుంది. ఇక అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ తో ఒంటరిగా గడపడానికి అందమైన విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుక్కుంది. ప్రస్తుతం ఆ బంగ్లాలోనే తన దాంపత్య జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది.

    ఇక అలియా తర్వాత ఒక్కో పోస్ట్ కి ఎక్కువ వసూళ్లు చేస్తున్న హీరోయిన్ల లిస్ట్ లో శ్రద్ధా కపూర్ ది తర్వాత ప్లేస్. ఆమె ఒక్కో పోస్ట్ కి 60 లక్షలు తీసుకుంటుంది. శ్రద్ధా కపూర్ కి కూడా ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో 68.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

    శ్రద్ధా కపూర్ తర్వాత స్థానం దీపిక పదుకొణెకి దక్కింది. దీపికా ఒక్కో పోస్ట్ కి 50 నుంచి 60 లక్షలు తీసుకుంటుంది. దీపిక పదుకొణెకి కూడా ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో 63.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

    Alia Bhatt

    ఆ తర్వాత ప్లేస్ అనుష్క శర్మది. ఒక్కో పోస్ట్ కి అనుష్క శర్మ కూడా 50 లక్షలు తీసుకుంటుంది. అనుష్క శర్మకి కూడా ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో 60.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

    అనుష్క శర్మ తర్వాత స్థానం కత్రినా కైఫ్ కి దక్కింది. కత్రినా ఒక్కో పోస్ట్ కి 50 లక్షలు తీసుకుంటుంది. కత్రినాకి కూడా ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో 55.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ సుందరాంగులందరూ సైడ్ బిజినెస్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. డబ్బుల కోసం కొత్త దారులను వెతుక్కున్నారు.

    అసలు బ్రాండ్స్ అన్నీ హీరోయిన్ల వెంట పడటానికి ఒక కారణం ఉంది. బ్రాండ్స్ లో వైన్ బ్రాండ్స్ లాంటి వాటిని టీవీల్లో, పత్రికల్లో ప్రోమోట్ చేసేందుకు మన చట్టాలు అంగీకరించవు. కాబట్టి.. ఆ బ్రాండ్స్ ఓనర్స్.. తెలివిగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి ఇలా ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తమ్మీద హీరోయిన్లు సోషల్ మీడియాతో కూడా బాగా సంపాదిస్తున్నారు.

    Also Read: Sita Ramam- Pooja Hegde: ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ పాత్రని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Tags