https://oktelugu.com/

Krithi Shetty: మెగా హీరోతోనే బేబమ్మ కెరీర్ తేలిందా?

మొదటి మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 28, 2024 / 04:08 PM IST

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు టాలీవుడ్ లోనే బిజీ హీరోయిన్ గా కొనసాగింది. తొలి సినిమా ఉప్పెన విడుదలకు ముందు నుంచే ఈమె మంచి గుర్తింపును సొంతం చేసుకొని వరసుగా రెండు సినిమాలకు కమిట్ అయింది. ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అయినా నేపథ్యంలో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. రెండు సంవత్సరాలు ఈమె హవా జోరుగా సాగింది.

    మొదటి మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ అమ్మడు కెరీర్ లో కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకున్న సినిమాలు నిరాశ పరచడం తో బేబమ్మకి ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో ఈమె నటిస్తున్న సినిమా ఒక్కటి కూడా లేదు. మలయాళం లో ఒక చిన్న సినిమా మాత్రమే చేసింది. ఆ మధ్య తమిళం లో ఒక పెద్ద హీరో కి జోడీగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిందట.

    అయితే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో కూడా నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈమె ఆ తర్వాత కథలు ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసి బాక్సాపీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈమె నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు పూర్తిగా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత వెంకట ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాపై హోప్స్ ఉండేవి. కానీ కస్టడీ సినిమా కూడా ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో.. ఇప్పటి వరకు ఈమెకు ఒక్క హిట్ కూడా లేదు.

    అయితే నాగచైతన్యతో సినిమా అంటే హిట్ పక్కా అనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. మెగా హీరోతో సినిమా అంటే కచ్చితంగా కృతి శెట్టి కెరీర్ మళ్లీ గాడిలో పడ్డట్లే అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కృతి శెట్టి ఈ సారి సక్సెస్ సాధిస్తే మరో నాలుగు సంవత్సరాల పాటు సినిమాలు తన చేయి దాటవు అంటూ ఆమె అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోగా.. ఇప్పుడు కృతి పేరు కూడా ఇండస్ట్రీలో పెద్దగా వినిపించడం లేదు.