Krithi Shetty: కృతి శెట్టి ప్రత్యేక పూజాలు చేయిస్తున్నారట. ఆ దోషాలకు విరుగుడు మంత్రాలు చదివిస్తున్నారట. గతంలో రష్మిక మందాన ఇదే పని చేయగా ఈ న్యూస్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన మూవీతో మెగా హీరో వైష్ణవ్ వెండితెరకు పరిచయమయ్యారు. లవ్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కాసులు కురిపించింది. 2021 మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్ళతో ఉప్పెన టాలీవుడ్ రికార్డ్స్ నమోదు చేసింది.

యంగ్ బ్యూటీ కృతి నటనకు యువత ఫిదా అయ్యారు. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్ మూవీతో కృతి మరో హిట్ కొట్టింది. ఇక 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అతికొద్ది మంది డెబ్యూ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ కృతి సాధించి చూపించింది. అయితే ఆమె ఆనందాన్ని బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఆవిరి చేశాయి. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో కృతి హీరోయిన్ గా నటించారు. ఇవి రెండూ డిజాస్టర్ అయ్యాయి.
Also Read: Ranga Ranga Vaibhavanga Review: రివ్యూ : ‘రంగ రంగ వైభవంగా’
కాగా కృతి లక్కీ హీరోయిన్ ట్యాగ్ కి కూడా ఎసరొచ్చింది. ఆమె నెక్స్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఎందుకైనా మంచిదని దోష నివారణ పూజలు చేయిస్తుందట. వరుస విజయాలతో దిష్టి తగిలిందని, ఆ కారణంగా రెండు ప్లాప్స్ పడ్డాయని సన్నిహితులు అన్నారట. అలాగే ప్రత్యేక పూజలు చేయించడం ద్వారా హిట్ ట్రాక్ ఎక్కవచ్చని సూచించారట. దానితో దోష నివారణ పూజల్లో కృతి పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో రష్మిక మందాన కూడా కొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వివాదాస్పద వేణు స్వామి ఆమె చేత పూజలు చేయించారు. ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. ఇక ప్రస్తుతం రష్మిక కెరీర్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇక రాజకీయాల్లో కూడా రష్మిక చక్రం తిప్పిందని వేణు స్వామి చెప్పడం విశేషం. మరి రష్మిక మాదిరి కృతికి పూజలు కలిసొస్తే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టేశేవారు లేకపోలేదు.
Also Read:Pawan Kalyan First Movie: హీరో కాకపోతే పవన్ చేద్దామనుకున్న పని అదే!
[…] Also Read: Krithi Shetty: ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి శ… […]
[…] Also Read: Krithi Shetty: ప్రత్యేక పూజలు చేస్తున్న కృతి శ… […]