https://oktelugu.com/

Krithi Shetty: రోజురోజుకు రేంజ్ ను పెంచుకుంటున్న ‘కృతి శెట్టి’

Krithi Shetty:  మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి. టాలీవుడ్‌ లోకి స్టార్ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. కృతి తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. అమ్మడు అంత డిమాండ్ చేసినా మేకర్స్ డబ్బులు ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, విచిత్రంగా ఆసక్తి చూపించినా.. అమ్మడు డేట్లు మాత్రం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 5, 2022 / 04:50 PM IST
    Follow us on

    Krithi Shetty:  మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి. టాలీవుడ్‌ లోకి స్టార్ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. కృతి తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. అమ్మడు అంత డిమాండ్ చేసినా మేకర్స్ డబ్బులు ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

    Krithi Shetty

    
    

    అయితే, విచిత్రంగా ఆసక్తి చూపించినా.. అమ్మడు డేట్లు మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో మూడు సినిమాలకు ఓకే చెప్పింది. వీటిలో సుధీర్ బాబు, నాని, అఖిల్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాల్లో ఏ ఒక్క మూవీ హిట్టైనా కృతి స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే. ఇప్పుడు కృతి రూ. 2 కోట్లు కావాలి అంటుంది. అప్పుడు 4 కోట్లు కావాలి అంటుంది ఏమో.

    Also Read:  ఎన్టీఆర్ కోసం 4 కోట్లు తీసుకున్న అలియా భట్

    మొత్తానికి కృతి శెట్టి రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. అయినా ఈ రోజుల్లో ఏ కొత్త హీరోయిన్ లో ఏ కోణంలోనైనా మ్యాటర్ ఉంది అని అనిపిస్తే చాలు.. అందరి చూపు ఆమె వైపుకి వెళ్లిపోతుంది. ఎంతైనా కుర్రాళ్ళ మ‌తి పోగొట్టింది ఈ యంగ్ బ్యూటీ. అందుకే, అమ్మడికి భారీ క్రేజ్ వచ్చింది. అసలు టాలీవుడ్ కి ఎప్పటినుంచో ఒక ఆచారం ఉంది.

    Tollywood Heroine Krithi Shetty

    తెలుగు తెర పై వచ్చే కథల్లో కొత్తదనం లేకపోయినా నటీమణుల విషయంలో మాత్రం నిత్యం కొత్తదనం కోరుకుంటారు మనవాళ్ళు. అందుకే, ప్రతి సంవత్సరం తెలుగు తెర పై కనీసం డజను మంది కొత్త భామలు గ్లామర్ ప్రపంచంలోకి అందాల ఆరబోతకు రెడీ అవుతారు. కాకపోతే ఎంత ఆరబోసినా వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేరు. కానీ, కృతి శెట్టి లాంటి వారు పాతుకుపోతారు.

    Also Read: నదియా గురించి మీకు తెలియని నిజాలు.. వింటే ఆశ్చర్య పోతారు..

    Recommended Video:

    Tags