https://oktelugu.com/

Alia Bhatt: ఎన్టీఆర్ కోసం 4 కోట్లు తీసుకున్న అలియా భట్

Alia Bhatt: ఆలియా భట్ ప్రస్తుతం ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా మూడ్ లో ఉంది. అయితే, ఆమె ఇప్పడిప్పుడే ఆ సినిమా మూడ్ నుంచి బయటకు వస్తోంది. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపించింది. నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనేక రూమర్స్ వచ్చాయి . […]

Written By: , Updated On : April 5, 2022 / 04:39 PM IST
Follow us on

Alia Bhatt: ఆలియా భట్ ప్రస్తుతం ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా మూడ్ లో ఉంది. అయితే, ఆమె ఇప్పడిప్పుడే ఆ సినిమా మూడ్ నుంచి బయటకు వస్తోంది. ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపించింది. నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనేక రూమర్స్ వచ్చాయి .

Alia Bhatt

Alia Bhatt, ntr

ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా ఫిక్స్ అయింది. నిజంగానే మేకర్స్ ఆమెను ఫిక్స్ చేసినట్లు, ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తి అయిందని బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ‘అలియా భట్’ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరలోనే ఈ వార్త పై అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఈ సినిమా గురించి హీరోయిన్ ఆలియా భట్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించారు.

Also Read:  నదియా గురించి మీకు తెలియని నిజాలు.. వింటే ఆశ్చర్య పోతారు..

ఆల్ రెడీ కొరటాల శివ స్టోరీ కూడా చెప్పారు. నేను మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పింది. ఇందులో తారక్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడని టాక్. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.

Alia Bhatt

Alia Bhatt, ntr

ఇంతకీ ఈ సినిమా కోసం అలియా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ? 4 కోట్లు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ సినిమాలో మొత్తంగా మూడు గెటప్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: లేచింది మహిళా లోకం… రాజకీయాలను శాసించిన టాలీవుడ్ హీరోయిన్స్

Recommended Video:

Tamannah Bhatia Marriage Fixed with A Businessman || Tamannah Marriage || Ok Telugu Entertainment

Tags