BJP Govt Bans 24 Youtube Channels: తప్పుడు వార్తలు ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దేశ భద్రత, సమగ్రత దృష్ట్యా ఇలాంటి చానెల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 320కి పైగా చైనా యాప్స్ పై నిషేధించిన విషయం తెలిసిందే. 2021 ఐటీ రూల్స్‌ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో 22 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, 3 ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్‌బుక్ అకౌంట్, మరో న్యూస్ వెబ్‌సైట్‌ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ జాతీయ భద్రత, భారతదేశ విదేశీ సంబంధాలకు సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయని, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం ని షేధించిన యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లలో 18 ఇండియాకి చెందినవి కాగా, 4 పాకిస్తాన్‌కు చెందినవి ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ భారత సాయుధ బలగాలు, జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటీవ్ అంశాలపై ఫేక్‌న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్‌బుక్ అకౌంట్, న్యూస్ వెబ్‌సైట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో కూడా వందల యూట్యూబ్ చానల్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్యాన్ చేసింది.
గతంలో కూడా మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం, పౌరసత్వం సవరణ హక్కు చట్టం వంటి వాటిపై రెచ్చగొట్టే వార్తలను, వీడియోలను పోస్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మైనారిటీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చానెళ్ల పై నిషేధం విదించింది.