Homeఎంటర్టైన్మెంట్Krithi Shetty emotional: అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ కృతి...

Krithi Shetty emotional: అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి..

Krithi Shetty emotional: ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి , యూత్ ఆడియన్స్ ల ఒక రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కృతి శెట్టి(Krithi shetty) , ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఎంత ఇబ్బంది పడుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘ఉప్పెన ‘ తర్వాత ఆమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు కూడా కమర్షియల్ గా హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో అందరూ ఈమెని సోషల్ మీడియా లో ఐరన్ లెగ్ అని పిలవడం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం తగ్గలేదు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. నేడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘LIK’ మూవీ విడుదలైంది.

ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా స్టేటస్ ఏంటో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు కృతి శెట్టి ప్రొమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనపై సోషల్ మీడియా లో వచ్చే నెగెటివ్ కామెంట్స్ పై చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘ఒక సినిమాని ఒప్పుకున్నాను అంటే , ఆ సినిమా కోసం నూటికి నూరు శాతం నా వైపు నుండి ది బెస్ట్ ఔట్పుట్ ఇవ్వడమే నా డ్యూటీ. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పుడు నన్ను సోషల్ మీడియా ఐరన్ లెగ్ అని పిలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక సినిమా ఫెయిల్యూర్ ని నటీనటులకు ఆపాదించడం అన్యాయం’.

‘సాధ్యమైనంత వరకు ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి చూస్తుంటాను. కానీ ఎంతైనా నేను కూడా మనిషినే కదా, అప్పుడప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. ఒకరోజు నేను చాలా బాధ పడుతున్న సమయం లో నయనతార గారు నాకు ఫోన్ చేసి , చాలా మోటివేట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. మరి ఈ ‘LIK’ చిత్రం ఆమె ఫెయిల్యూర్స్ కి బ్రేక్ వేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇకపోతే కృతి శెట్టి రీసెంట్ గానే వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటించబోతుంది. ఒకవేళ LIK మూవీ ఫలితం అటు ఇటు అయినా, అనిల్ రావిపూడి మూవీ తో కృతి శెట్టి కచ్చితంగా కం బ్యాక్ ఇస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular