Homeఎంటర్టైన్మెంట్Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి తో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో గ్రాఫర్.. వీడియో వైరల్..

Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి తో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో గ్రాఫర్.. వీడియో వైరల్..

Krithi Shetty: సినీ సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులే , వాళ్ళకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది కొంతమంది ఎందుకు గ్రహించారో అర్థం కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా?, ఏ మూడ్ లో ఉన్నారు?, ఎలా ప్రవర్తించాలి వంటివి ఏమి ఉండవు, వాళ్ళు కనిపించగానే మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేయాలి , ఒకవేళ ఇవ్వకపోతే వాళ్లపై నెగెటివ్ కథనాలు ప్రచారం చేయడం , ఇవే జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోగ్రాఫర్స్ నుండి తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ లిస్ట్ లో చేరిపోయింది. రీసెంట్ గా ఈమె షూటింగ్ ని ముగించుకొని వస్తున్న సమయం లో విమానాశ్రయం లో చేదు అనుభవం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

విమానాశ్రయం లో దిగి కారు ఎక్కుతున్న సమయం లో కృతి శెట్టి ని ఫోటో గ్రాఫర్స్ చుట్టుముట్టి ఫోటోలు తీశారు. వాళ్ళ కోసం ఆమె ఆగి ఫోటోలు కూడా దిగింది. తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె బ్యాక్ వైపు కూడా ఫోటోలు తీశారు. అందుకు ఆమె ఇబ్బంది పడుతూ వద్దు అని చెప్పింది. అయినప్పటికీ వినకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. చివరికి చిరాకు పడి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫోటో గ్రాఫర్స్ తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇలా సినీ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని , వాళ్ళు ఒక్కసారి నో చెప్తే అర్థం చేసుకోవాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే , ఈమధ్య కాలం లో ఈమె చేసే ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర బలంగా పడింది. ఇప్పుడు ఈమె వెంకటేష్ , అనిల్ రావిపూడి , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న క్రేజీ మూవీ లో ఒక హీరోయిన్ గా నటించబోతుంది. వరుస హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి , కృతి శెట్టి కి హిట్ ఇస్తాడా లేదా ఆయనే కృతి శెట్టి కారణంగా డిజాస్టర్ ని అందుకుంటాడా అనేది చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper
Exit mobile version