Venkatesh – Anil Ravipudi : రెండు తెలుగు రాష్ట్రాల్ని జనాలు, ప్రస్తుతం థియేటర్స్ కి క్యూలు కట్టాలంటే ఒక్క సంక్రాంతి సీజన్ తప్ప , మరో సీజన్ కనిపించడం లేదు. ఒకప్పుడు సమ్మర్ సీజన్ కి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు IPL పుణ్యమా అని , సమ్మర్ కి తమ సినిమాలను విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు మేకర్స్. అందుకే టాలీవుడ్ మేకర్స్ టార్గెట్ ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అయితే సంక్రాంతి సీజన్ ని అనిల్ రావిపూడి సినిమా లేకుండా అసలు ఊహించుకోలేము. ఆయన తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఎఫ్ 2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి చిత్రాలు ఈ సీజన్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి , వెంకటేష్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే.
ఇందులో కళ్యాణ్ రామ్ మరో హీరో గా నటిస్తుండగా , కీర్తి సురేష్ , కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది. అయితే ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు అనిల్ రావిపూడి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసాడు. కానీ లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవ్వడం అసాధ్యమని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో ప్రస్తుతం ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్లాన్ ప్రకారం అయితే , ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కి విడుదల చెయ్యాలి. కానీ షూటింగ్ ప్రక్రియ బాగా ఆలస్యం అవుతుందట.
అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తున్నారట. మరో మూడు నెలల పాటు షూటింగ్ ఉండడం తో , అనిల్ రావిపూడి మూవీ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని , నవంబర్ నెలలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని , కేవలం రెండు నెలల్లో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేయడం అసాధ్యం కాబట్టి, ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవ్వడం అసాధ్యమని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అయితే అనిల్ రావిపూడి సినిమాలు సంక్రాంతి సీజన్ లో తప్ప, ఎప్పుడు వచ్చినా ఫ్లాప్ అవుతాయి అనేది కొందరి వాదన. కానీ ప్రస్తుతానికి అనిల్ రావిపూడి బ్రాండ్ ఇమేజ్ మన టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ లో ఉంది. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా చూస్తారని అంటున్నారు.
