
తెలుగు తెరపై సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్ తెరపై వెలుగొందుతున్నాడు. అలాంటి కృష్ణ తన కోరికను బయటపెట్టాడు. తన కొడుకు, స్టార్ హీరో మహేష్ బాబుతో అలాంటి సినిమా చేయాలని ఉందని అన్నాడు.
తెలుగులో వచ్చిన చిత్రాలన్నింటిలోకి ‘పాతాళ భైరవి’ అనేది ఎవర్ గ్రీన్ ఆణిముత్యం లాంటి సినిమా.. ఇందులో కథ, కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ గొప్ప అద్భుత కావ్య చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నాడట కృష్ణ. దీనికోసం మహేష్ బాబును ఒప్పించాలని ప్రయత్నించాడట.. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘పాతాళ భైరవిని మహేష్ బాబుతో హిందీలో రిమేక్ చేయాలనుకున్నాం.. కానీ మహేష్ దీనికి ఒప్పుకోలేదని కృష్ణ తెలిపాడు. మహేష్ బాబుకు బాలీవుడ్ కు వెళ్లాలన్న ఆలోచన లేదని.. ఇక్కడ తాను నంబర్ 1గా ఉన్నాడని.. అది చాలని అన్నాడని కృష్ణ తెలిపారు. బాలీవుడ్ లో నలుగురిలో ఒకడిగా ఉండడం ఎందుకన్నది మహేష్ ఆలోచనగా ఉందని కృష్ణ తెలిపారు. అయితే ఈ సినిమాను హిందీలో తప్పకుండా రీమేక్ చేస్తామని తెలిపారు.
ఇక హృతిక్ రోషన్ తో తెలుగులో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ రిమేక్ చేస్తామని కృష్ణ తెలిపారు. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై దీన్ని తీస్తామన్నారు.