లాక్ డౌన్ లో ప్రపంచం మొత్తం నాలుగు గోడలకే పరిమితమైపోయింది. విహారాలు.. టూర్లు పక్కన బెడితే.. కనీసం వీధిలో పచార్లు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. విదేశాల్లో పరిస్థితి అటుంచితే మన దగ్గర మాత్రం ఫ్రీ అయిపోయారు జనం. దీంతో.. ఒక్కసారిగా రెక్కలు కట్టుకొని హాలీడే ట్రిప్ వేసేస్తున్నారు. ఎవరికి తోచిన దిక్కుకు వాళ్లు వెళ్లిపోతున్నా.. సినీ ప్రముఖులు మాత్రం ఒకే ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకుంటున్నారు. అదే మాల్దీవులు.
Also Read: అప్పుడు గుంపులో గోవింద పాత్రలు.. ఇప్పుడు అనసూయ కోసమే ప్రధాన పాత్రలు!
సెలబ్రిటీలందరికీ మాల్దీవులు మాంచి ఎంజాయ్‌మెంట్ స్పాట్ గా మారిపోయాయి. ముఖ్యంగా.. టాలీవుడ్ జనాల్లో చాలా మందికి జాలీడే డెస్టినేషన్ ఏదీ అనగానే.. మాల్దీవులే గుర్తొస్తున్నాయి. హాలీడే వెకేషన్ నుంచి హనీమూన్ దాకా.. అకేషన్ ఏదైనా మాల్దీవుల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలంటూ రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారిక్కడ.
తాజాగా.. రెబెల్ స్టార్ కృష్ణరాజు తన ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు మరి. బ్లాక్ గాగుల్స్ తో.. పార్టీ వేర్ తో ఫ్యామిలీ మొత్తం సందడి చేస్తున్నారు. భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలతో కలిసి సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు కృష్ణం రాజు. ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
Also Read: ‘కార్తీక దీపం’ అత్త గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు
ఈ పిక్స్ లో కృష్ణరాజు లుక్స్ అదిరిపోతున్నాయి. వైట్ బియార్డ్ తో.. బ్లాక్ గాగుల్స్ తో కూల్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ సీనియర్ హీరో. సహజంగా రెబల్ స్టార్ ఫొటోలు అంత తేలిగ్గా లభించవు. అలాంటిది ఒక్కసారిగా వెకేషన్ ఫొటోస్ షేర్ చేయడంతో.. ఈ రేర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.