https://oktelugu.com/

Superstar Krishna: ఎన్టీయార్ కి పోటీ గా వచ్చి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న కృష్ణ…

దానవీరశూరకర్ణ సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. అయితే ఎన్టీయార్ ముందుగా కృష్ణతో కురుక్షేత్రం సినిమాని వేరే డేట్ కి రిలీజ్ చేయమని చెప్పాడట.

Written By:
  • Gopi
  • , Updated On : February 20, 2024 / 05:08 PM IST
    Follow us on

    Superstar Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక సినిమాలు చేయాలి అంటే అది ఒక ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చాలామంది హీరోలు పౌరాణిక పాత్రలను పోషించినప్పటికీ ఎన్టీఆర్ మెప్పించినంతగా మరే హీరో కూడా ఆ పాత్రల్లో మెప్పించలేదు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు కృష్ణ కి, ఎన్టీయార్ కి మధ్య కొన్ని క్లాషేష్ అయితే వచ్చాయి. దానివల్ల ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాకి పోటీగా, కృష్ణ కురుక్షేత్రం సినిమాని రిలీజ్ చేశాడు. అయితే కురుక్షేత్రం సినిమా డిజాస్టర్ అయింది.

    కానీ దానవీరశూరకర్ణ సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. అయితే ఎన్టీయార్ ముందుగా కృష్ణతో కురుక్షేత్రం సినిమాని వేరే డేట్ కి రిలీజ్ చేయమని చెప్పాడట. అయినప్పటికీ కృష్ణ మాత్రం పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాను జనవరి 14వ తేదీనే రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండటంతో ఆయన అదే రోజు ఆ సినిమాను రిలీజ్ చేశాడు.

    ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పటికీ దానవీరశూరకర్ణ సినిమా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. కృష్ణ కురుక్షేత్రం మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక అప్పటి నుంచి వీళ్ళ సినిమాల మధ్య పోటీ అయితే నడిచింది. అందులో కొన్నిసార్లు కృష్ణపై చేయి సాధిస్తే, మరికొన్నిసార్లు ఎన్టీఆర్ పై చేయి సాధించాడు. ఇక మొత్తానికైతే, ఈ సీనియర్ హీరోల మధ్య ఆ తర్వాత కూడా కొన్ని విభేదాలు అయితే వచ్చాయి.

    దానివల్ల వీళ్ళిద్దరూ చాలా వరకు సఫర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటులలో వీళ్ళిద్దరూ ముందు స్థానంలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అనే చెప్పాలి. కృష్ణ సినిమాల పరంగా ఎన్టీఆర్ కంటే జూనియర్ అయినప్పటికీ చాలా ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ కృష్ణ మంచి విజయాలను అందుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అన్ని రకాల జానర్లలో సినిమాలను చేస్తూ నెంబర్ వన్ స్థానాన్ని ఎప్పటికప్పుడు పదిలం చేసుకుంటూ వచ్చాడు…