https://oktelugu.com/

IT Employees: పెరగని జీతం.. లేని కొత్త నియామకం.. నిరాశలో టెక్కీలు..

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో పాటు ఏడాది కిందటే ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడిందని కొందరు ఉన్నతాధికారులు వెల్లడించారు. 2021-2022 కాలం తరువాత ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగానే మారుతోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2024 / 05:11 PM IST

    IT Employees

    Follow us on

    IT Employees: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు ఐటీ జాబ్ అంటే భారీ జీతం.. సకల సౌకర్యాలు.. ప్రమోషన్లు.. టూర్ ట్రిప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం అంటే తెగ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇందులో పనిచేస్తున్న వారు ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో ముందుగా ఐటీ ఉద్యోగులపైనే ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను పక్కన బెట్టాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం అవకాశం ఇచ్చినా.. తక్కువ జీతం, సౌకర్యాల్లో కోత విధించేవారు. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేసేవారికి కొత్త జీతం పెరగకపోవడంతో పాటు కొత్త ఆఫర్లు రావడం లేదు.

    ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో పాటు ఏడాది కిందటే ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడిందని కొందరు ఉన్నతాధికారులు వెల్లడించారు. 2021-2022 కాలం తరువాత ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగానే మారుతోంది. చాలా కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఇదే సమయంలో తక్కువ జీతంతో పనిచేసే వారికి వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతో భారీ జీతం ఆశించే వారికి నిరాశే మిగులుతుంది.

    ప్రస్తుతం మార్కెట్లో టాలెంట్ తో ఉన్నవారు తక్కువ జీతంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ కంపెనీ ప్రతినిధి చెబుతున్నాడు. అయితే కొందరిని పక్కకు బెట్టిన వారిని 30 శాతం తక్కువ జీతంతో పలు కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. దీంతో చేసేదీమీ లేక చాలా మంది ఇంతకాలం భారీ జీతంతో పనిచేసిన వారు ఇప్పడు తక్కు జీతం అయినా సరే చేయడానికి ముందకు వస్తున్నారు.

    అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందా? అంటే చెప్పలేమని కొందరు నిపుణులు అంటున్నారు. చాలా వరకు సీరీస్ ఏ ఫండింగ్ దాటిన ప్రారంభ స్టార్టప్ ద్వారానే నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే గతంలో కాకుండా జాగ్రత్తగా నియామకాలు చేపడుతున్నట్లు మరో టెక్ కంపెనీ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వార వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా కొంత కాలం పాటు టెక్కీలకు కష్టాలు తప్పనవి అంటున్నారు.