ఐపీఎల్ 2021 రెండో సెషన్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో ముంబై ఓడిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్ కి 166 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 166 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. పది ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరు ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ కి కష్టాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో ముంబై ఇండియన్స్ కి ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ల మీద ఆర్సీబీ బౌలర్లు ఒత్తడి పెంచి స్కోరు చేయకుండా అడ్డుకోగలగం ఆర్సీబీ విజయానికి ప్రధాన కారణం అని చెప్పాలి. అయితే దీనిపై ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ మిడిలార్డర్ వైఫల్యం వల్లే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఈ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిందని అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులతో మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. కానీ మిడిలార్డర్ విఫలం కావడంతో ఓత్తిడి పెరిగిపోయింది. శుభారంభం లభించిన తర్వాత వరుస వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టం. ప్రస్తు సీజన్లో ముంబై పరిస్థితి అంత ఏం బాగోలేదు. ముంబై అంటే దూకుడైన ఆటకు పేరు.కానీ ఈ సీజన్లో జట్టులో లోపించింది ఆ దూకుడు అని జహీర్ తెలిపాడు. హ్యాట్రిక్ సాధించిన హర్షల్ అద్భుతంగా బంతులేశాడని అన్నాడు.