Balayya Movie: ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ సినిమా. అలాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినటిం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. గ్రాండ్ గా ముహూర్తం కార్యక్రమాలను మొదలు పెట్టి, సినిమా జానర్ ఎలాంటిదో కూడా చెప్పేసారు. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పీరియడ్ సినిమా అని, రాజుల కాలం నాటి కథ అని, ఇందులో నందమూరి బాలకృష్ణ మహారాజు గా కనిపించబోతున్నాడని, టైటిల్ కూడా అదేనంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ సినిమా ఇప్పుడు అట్టకెక్కింది అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్. సినిమాకు బడ్జెట్ 250 కోట్ల రూపాయలకు పైగానే అవుతుందని, అంత బడ్జెట్ బాలయ్య ప్రస్తుత మార్కెట్ కి పెట్టలేమని , ఆయన సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 80 నుండి 100 కోట్ల మధ్యలోనే షేర్ వసూళ్లు వస్తున్నాయని, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ఆయన సినిమాలు ఆడియన్స్ పెద్దగా చూడరని, అసలే ఓటీటీ రైట్స్ ఈమధ్య ఏ సినిమాకు కూడా అమ్ముడుపోవడం లేదని, ఈ పీరియడ్ చిత్రానికి కూడా ఓటీటీ రైట్స్ మరియు ఇతర రైట్స్ కలుపుకున్న కూడా అంత బడ్జెట్ రీకవరీ అయ్యి లాభాల్లోకి రావడం అసాధ్యమని నిర్మాత అన్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలుస్తుంది. గతంలో రవితేజ తో కూడా ఒక సినిమాని ఇలాగే మొదలు పెట్టి, బడ్జెట్ వర్కౌట్ అవ్వడం లేదని ఆపేసారు. ఆ సినిమా మరేదో కాదు, ‘జాట్’.
రవితేజ తో చెయ్యాలని అనుకున్న ఆ సినిమాని బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేసి సూపర్ హిట్ ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు బాలయ్య తో మొదలు పెట్టిన సినిమా రద్దు అయ్యింది . అయితే దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేసే ఆలోచనలో ఉన్నాడట గోపీచంద్ మలినేని. కొద్దినెలల క్రితమే ఈయన పవన్ కళ్యాణ్ కి కలిసినట్టు తెలుస్తుంది. కచ్చితంగా వీళ్ళ కాంబియేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది అనే వార్త వచ్చింది. మరి ఆ సినిమా బాలయ్య తో చెయ్యాలనుకున్న చారిత్రిక సినిమానే ఇప్పుడు అవ్వబోతుందని అంటున్నారు. బాలయ్య తో ప్రస్తుతం సినిమా చేస్తాడట కానీ, భారీ బడ్జెట్ తో కాకుండా, వీర సింహా రెడ్డి తరహా కమర్షియల్ ఎంటర్టైనర్ ని చేస్తాడని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.