Krishna Vamsi rejects Trivikram Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు మంచి గుర్తింపైతే లభించింది. ఒకప్పుడు నెంబర్ వన్ రైటర్ గా పేరు సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. గత సంవత్సరం చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ (NTR) తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన రచయితగా ఉన్నప్పుడు క్రియేట్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) చేసిన ‘సముద్రం’ సినిమాలో ఒక సీన్ కోసం త్రివిక్రమ్ చాలా పేజీల్లో ఒక మంచి సీన్ అయితే రాసాడట. డైరెక్టర్ కృష్ణవంశీ మాత్రం ఆ సీన్ చూసి ఇక్కడ ఇంత పెద్ద సీన్ డైలాగ్స్ అవసరం లేదని, కేవలం ఏ డైలాగు లేకుండా తనికెళ్ల భరణి గారిని జైలు నుంచి బయటికి వచ్చి ఎస్ ఐ కి నమస్కారం చేసి తన ఇంటికి వెళ్లి తన పిచ్చి భార్యతో మాట్లాడేంతవరకు చాలా సైలెంట్ గా సీన్ ని నడిపించాడు. దాంతో ఆ సినిమాకే ఆ సీన్ హైలెట్ గా నిలిచింది.
ఇక గతంలో తనికెళ్ల భరణి ఒక ఇంటర్వ్యూలో ఆ సీన్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సారి తన అత్యుత్తమమైన సీన్ ఏదైనా ఉంది అంటే అది ఈ సీనే అని ఆయన చాలా గొప్ప గా చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మొత్తానికైతే ఈ ఒక్క సీన్ తో కృష్ణవంశీ ఎలా ఆలోచిస్తాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఎక్కడ ఏ డైలాగ్ కావాలి, ఎక్కడ డైలాగ్ లేకపోతే బాగుంటుంది అనే విషయంలో చాలా గొప్పగా ఆలోచిస్తాడు.
మరి ఏది ఏమైనా కూడా తనికెళ్ల భరణి (Tanikella Bharani) లాంటి నటుడు సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప పాత్రల్లో నటించాడు. ఇక ఇప్పటివరకు నటుడిగా ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేసే పాత్రలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read: Manchu Manoj Kannappa: ‘కన్నప్ప’ టీంకి శుభాకాంక్షలు తెలియజేసిన మంచు మనోజ్.. కానీ ట్విస్ట్ ఏమిటంటే!
ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత త్రివిక్రమ్ అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గొప్ప రచయిత అని పేరు సంపాదించుకున్నప్పటికి ఆయన రాసిన దాన్ని పక్కన పెట్టేసి కృష్ణ వంశీ తన ఓన్ సీన్ చేయడం అనేది త్రివిక్రమ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…