Krishna Raju Last Wish: టాలీవడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం నింపింది. అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సినీ, రాజకీయాల్లో వెలుగు వెలిగిన కృష్ణంరాజు మరణంపై చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇక కృష్ణంరాజు చివరి బలమైన కోరిక ‘ప్రభాస్ పెళ్లి చూడడం’. ప్రభాస్ పెళ్లి చూడకుండానే పోతానేమే అని ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చాడు. మీడియా ముఖంగా కూడా కొప్పడ్డాడు. అసహనం వ్యక్తం చేశాడు. అయినా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు.

ప్రభాస్ కు , అనుష్కకు ప్రేమ ఉందని.. దీన్ని ఒప్పుకోకపోవడంతోనే ప్రభాస్ పెళ్లి కి దూరంగా ఉన్నారని గాసిప్పులు వచ్చాయి. ఆ మధ్యలో గోదావరి జిల్లాలకు చెందిన ఒక అమ్మాయిని సంబంధం చూశారని.. అది అందరికీ నచ్చినా కూడా ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో కృష్ణంరాజు కొప్పడ్డాడని వార్తలు వచ్చాయి. ఎన్ని సంబంధాలు చూసినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంపై కృష్ణంరాజు ఫైర్ అయ్యారట.. ప్రభాస్ పెళ్లి చూడాలని అదే తన చివరి కోరిక అని చాలా సార్లు చెప్పాడు. కానీ పెదనాన్న కోరికను ప్రభాస్ తీర్చలేకపోయాడు. దానికి ప్రేమ కారణమా? లేక మరేంటన్నది తెలియాల్సి ఉంది.
ప్రభాస్ పెళ్లితోపాటు కూతుళ్ల పెళ్లి చూడకుండానే కృష్ణంరాజు చనిపోవడం విషాదం నింపింది.