Krishnam Raju: టాలీవడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం నింపింది. అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సినీ, రాజకీయాల్లో వెలుగు వెలిగిన కృష్ణంరాజు మరణంపై చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృష్ణంరాజు తన జీవితంలో నెరవేర్చుకోలేని మూడు కోరికలు అలానే ఉండిపోయాయి. అవే నా చివరి కోరికలు అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో కేంద్రమంత్రిగా వాజ్ పేయి హయాంలో చేసిన కృష్ణంరాజుకు ‘గవర్నర్’ కావాలని చాలా ఆశపడ్డాడు. మోడీ, అమిత్ షాలన కలిశాడు. ఈ మధ్యన తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజుకు ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినా అవి నెరవేరలేదు. తన ‘గవర్నర్’ కల తీరకుండానే ఆయన మరణించారు.

ఇక తన ముగ్గురు కూతుళ్ల పెళ్లిని చూడకుండానే కృష్ణంరాజు మరణించారు. ముగ్గురి కూతుళ్లకు పెళ్లి చేయాలని చూసినా సంబంధాలు సెట్ కాకపోవడం.. కూతుళ్లు అంగీకరించకపోవడంతో వారి పెళ్లిళ్లు చేయలేకపోయారు. దీనిపై ఎంతోగానో బాధపడేవారు. ప్రతిసారి ఇదే విషయంపై కూతుళ్లపై ఒత్తిడి తెచ్చేవారు.
ఇక కృష్ణంరాజు చివరి బలమైన కోరిక ‘ప్రభాస్ పెళ్లి చూడడం’. ప్రభాస్ పెళ్లి చూడకుండానే పోతానేమే అని ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చాడు. మీడియా ముఖంగా కూడా కొప్పడ్డాడు. అసహనం వ్యక్తం చేశాడు. అయినా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ పెళ్లితోపాటు కూతుళ్ల పెళ్లి చూడకుండానే ఆయన చనిపోవడం విషాదం నింపింది. ఇక గవర్నర్ గిరీ దక్కకపోవడంతో ఆయన జీవిత చరమాంకంలోని మూడు కీలక కోరికలు నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని వీడి పోయారు.