Rajamouli Mahabharata: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… మహేష్ బాబు తో ‘వారణాసి’ సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో తను అనుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ఇప్పటివరకు ఇండియాలో లేనటువంటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. 1300 కోట్లతో తెరకెక్కుతున ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక తన తదుపరి సినిమాగా మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని ఎప్పటినుంచి చెబుతూ వస్తున్న ఈ సినిమాకి ఎట్టకేలకు మోక్షం అయితే కలగబోతోంది. ఇక ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర చాలా కీలకంగా మారబోతోంది. కాబట్టి ఆ పాత్ర కోసం ఏ హీరోని తీసుకుంటున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో విపరీతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి…
ఇక రాజమౌళి టీం నుంచి వినపడుతున్న వార్తలను బట్టి చూస్తే మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేత చేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజమౌళికి క్లోజ్ ఫ్రెండ్ కావడం వల్ల తను చెప్పినట్టుగా వింటాడు. అలాగే ఎన్టీఆర్ ఆ పాత్రలోని వేరియేషన్స్ ను సైతం సరికొత్తగా ఆవిష్కరిస్తాడు. కాబట్టి తనైతేనే ఆ పాత్రకి చాలా బాగా న్యాయం చేయగలడని రాజమౌళి అనుకుంటున్నాడట.
రాజమౌళి చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వింటాడు కాబట్టి తనకోసం ఎన్ని డేట్స్ అయినా కేటాయించడానికి ఎన్టీఆర్ రెడీగా ఉంటాడనే ఉద్దేశ్యంతోనే తనను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందర్లోనే మహాభారతం సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇందులో ఇండియాలో ఉన్న చాలా మంది నటులు నటించబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఎక్కువ పాత్రలు ఉండటంవల్ల ఎవరు ఏ పాత్రలో నటిస్తారు అనే దానిమీద రాజమౌళి తొందర్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు…ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది…