Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. వీరిద్దరూ చంద్రబాబుపై అటాక్ చేసినట్టుగా మరొకరు చేయలేదు. లోకేష్ విషయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చివరకు ఆయన బాడీ షేమింగ్ పై కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇద్దరూ నేతలు ప్రతిపక్షంలోకి మారేసరికి పరిస్థితి మారింది. కనీసం వీరి గురించి పట్టించుకునే వారు లేరు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదు. ఎందుకంటే వీరిపై అంతలా నిఘా ఉంటుంది కూడా. చివరకు జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు హాయిగా ఉంటారు. కానీ అదే పార్టీకి చెందిన ఇతర నేతలకు మాత్రం నిద్ర పట్టదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తో పాటు గన్నవరం ఆ పార్టీకి ఫేవరెట్ నియోజకవర్గాలు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి మింగుడు పడనివి.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సవాల్ చేసేవారు కొడాలి నాని. దమ్ముంటే రండి తేల్చుకుందాం గుడివాడలో అంటూ సవాల్ విసిరేవారు. ఎందుకంటే ఆయన 2009 నుంచి గెలుస్తూనే ఉన్నారు కాబట్టి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి సెంటిమెంట్ అస్త్రాలు పనిచేస్తాయి. మరోసారి ఆ పార్టీ అభివృద్ధి అంశాలు దోహదపడతాయి. కానీ ఇది తెలియని కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ అంత ఎత్తుకు ఎగిరి పడ్డారు. ఇద్దరూ ఓడిపోయారు. ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. గెలిచిన సమయంలో అంతా మేమే అనుకున్నారు. ఓడిపోయేసరికి ముఖం చాటేసారు. అంతా అయిపోయేసరికి అసలు సీన్ అర్థమైంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో పరపతి ఉండేది కొడాలి నానితో పాటు వల్లపనేని వంశీకి. కానీ వారి స్వయంకృతాపంతో ఆ నియోజకవర్గాల్లో పట్టుకోల్పోయారు. మొన్నటి ఎన్నికల్లో వారికి అపజయం ఎదురయింది. ఎంతలా అంటే ప్రజలు ద్వేషించే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనసు కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను బరిలో దించకపోతే ఆ రెండు నియోజకవర్గాల్లో కష్టమని తేలినట్లు సమాచారం. అందుకే గుడివాడ తో పాటు గన్నవరంలో వారికి ప్రత్యామ్నాయంగా మరో నేతలను రంగంలోకి దించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం ఆ ఇద్దరు నేతలు మౌనంగా ఉండి పోవాల్సిందే. ఎందుకంటే వారికి వేరే ఆప్షన్ లేదు. వేరే పార్టీల్లో చేరేందుకు అవకాశం లేదు.