చాన్నాళ్లకు సీనియర్ కమెడియన్ కి ఛాన్స్ !

యాక్షన్ హీరో గోపీచంద్ కి ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు రావటం ఒక ఆనవాయితీ అయిపొయింది. గత కొన్ని సినిమాలుగా హిట్ కోసం గోపీచంద్‌ చేయని ప్రయత్నం లేదు. అయినా హిట్ వచ్చిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితిలో కూడా యాక్షన్ హీరోగా కొనసాగడానికి గోపీచంద్ నానాతిప్పలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ చేస్తోన్న మరో యాక్షన్ సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ […]

Written By: admin, Updated On : October 14, 2020 7:06 pm
Follow us on


యాక్షన్ హీరో గోపీచంద్ కి ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు రావటం ఒక ఆనవాయితీ అయిపొయింది. గత కొన్ని సినిమాలుగా హిట్ కోసం గోపీచంద్‌ చేయని ప్రయత్నం లేదు. అయినా హిట్ వచ్చిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితిలో కూడా యాక్షన్ హీరోగా కొనసాగడానికి గోపీచంద్ నానాతిప్పలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ చేస్తోన్న మరో యాక్షన్ సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో ఓ కామెడీ రోల్ అద్భుతంగా ఉంటుందట. కేవలం కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

అయితే ఆ పాత్రలో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ నటిస్తున్నాడు. కృష్ణ భగవాన్ కు ఈ మధ్య అసలు సినిమాలే లేవు. చాల కాలం తరువాత కృష్ణ భగవాన్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికింది. మరి కృష్ణ భగవాన్ కి ఈ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ గా నటిస్తోంది. అయితే వీరి మధ్య నడిచే ట్రాక్ కూడా చాల ఫన్నీగా ఉంటుందట. మొత్తానికి సినిమాలో యాక్షన్ తగ్గించి పక్కా కామెడీ అంశాలను హైలెట్ చేయడానికి సంపత్ నంది బాగానే ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read: ప్రభాస్ మూవీలో అమితాబ్.. పారితోషికం అంతనా?

ఇక ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయట. ఆ సీన్స్ లో దాదాపు నూట ఏభై మంది జూనియర్ ఆర్టిస్ట్ లు అవసరం అవుతారని.. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అంతమందితో షూట్ చేయడం సాధ్యం కానీ పని కాబట్టి.. ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమా నుండి తొలిగిస్తున్నారట. ఏది ఏమైనా తన సినీ కెరీర్ లో గత కొన్నేళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడతా ఉన్నా గోపీచంద్.. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా బాగా నిరాశపరిచింది. అన్నట్టు తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజతో గోపీచంద్ తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. సంపత్ నంది, తేజ సినిమాలతో గోపీచంద్ ఈ సారి ఈ రేంజ్ హిట్స్ కొడతాడో చూడాలి.