https://oktelugu.com/

పాపం.. అందాల ‘నిధి’కి అవకాశాలు లేక.. !

అందం ఉంది.. పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటపడదు. అలాగే సెట్స్ లో పెద్దగా డిమాండ్స్ కూడా చేయదు, అన్నిటికీ సర్దుకుపోయే హీరోయిన్. మరి ఇలాంటి హీరోయిన్ కి అవకాశాలు రావట్లేదు అంటే ఏమనుకోవాలి. దీనిబట్టి టాలీవుడ్ లో ఏ హీరోయిన్ సినీ కెరీర్ అయినా ఓన్లీ సక్సస్ ల మీదే ఆధారపడి ఉంటుంది అనుకోవాలేమో. ఎంత అందం ఉన్నా, ఏ రేంజ్ లో ఆ అందచందాలను పరిచినా.. ఇక ఎంతగా అభినయంతో ఆకట్టుకున్నా.. సక్సెస్ […]

Written By:
  • admin
  • , Updated On : October 14, 2020 6:56 pm
    Follow us on


    అందం ఉంది.. పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటపడదు. అలాగే సెట్స్ లో పెద్దగా డిమాండ్స్ కూడా చేయదు, అన్నిటికీ సర్దుకుపోయే హీరోయిన్. మరి ఇలాంటి హీరోయిన్ కి అవకాశాలు రావట్లేదు అంటే ఏమనుకోవాలి. దీనిబట్టి టాలీవుడ్ లో ఏ హీరోయిన్ సినీ కెరీర్ అయినా ఓన్లీ సక్సస్ ల మీదే ఆధారపడి ఉంటుంది అనుకోవాలేమో. ఎంత అందం ఉన్నా, ఏ రేంజ్ లో ఆ అందచందాలను పరిచినా.. ఇక ఎంతగా అభినయంతో ఆకట్టుకున్నా.. సక్సెస్ లేకపోతే ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేస్తారు. సరే ఇప్పుడు సినిమా ఛాన్స్ లు రాకపోతే, తరువాత అయినా వస్తాయిలే అనుకోవచ్చు. కానీ చేతిలో ఉన్న అవకాశాలు కూడా జారిపోతుంటే.. ఇక ఆ హీరోయిన్ మానసిక పరిస్థతి ఎలా ఉంటుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ ను చూసి అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

    తనకు ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయనే కారణం చూపించి.. ఆమెకు వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటి అలా అలా నెమ్మదిగా వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్ళిపోతున్నాయట. దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి విషయం అడుగుతుంటే.. ఐటమ్,సాంగ్ ఉంది చేద్దువులే అంటున్నారట. నిజంగా నిధి పరిస్థితి విధి అనుకుని బాధ పడటం తప్ప ఏమి చేయలేని పరిస్థతి. నిధి అగర్వాల్.. ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా ఈ రేంజ్ లో ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు సరైన అవకాశాలు కూడా రావట్లేదని తెగ బాధపడుతోంది.

    Also Read: ప్రభాస్ మూవీలో అమితాబ్.. పారితోషికం అంతనా?

    నటనతో తానూ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేయలేకపోవచ్చు. కానీ అందచందాలతో అద్వితీయమైన నా ఫిజిక్ తో ఆకట్టుకుంటా కదా… అయినా ఎందుకు నన్ను పక్కన పెడుతున్నారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా మార్క్ వేసుకున్న నేను, టాలీవుడ్ కూడా సరైన రీతిలో రాణిస్తానని అనుకున్నానని, కానీ ఇక్కడ దర్శకనిర్మాతలు అవకాశాలు ఇవ్వట్లేదు అని, స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్న నన్ను, సరిగ్గా వాడుకోవట్లేదు అని నిధి అగర్వాల్ తెగ ఫీల్ అవుతోంది. చివరకు మహేష్ మేనల్లుడి అశోక్ గల్లా పక్కన నటించాల్సి వచ్చింది. ఇక రవితేజ – రమేష్ వర్మ సినిమాలో చాన్స్ వచ్చింది.. మళ్ళీ ఆ సినిమా నుండి నిధిని తప్పించారు. అలాగే తమిళంలో ‘భూమి’ అనే సినిమాలో కూడా నిధికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా నుండి కూడా నిధిని తప్పించారు. పాపం నిధి.