Hari Hara Veeramallu Krish : ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలకు VFX వర్క్స్ అనుకున్న సమయానికి రావడం లేదు. ఫలితంగా వాయిదాల మీద వాయిదాలు వేసుకోవాల్సి వస్తుంది. ఉదాహారానికి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని తీసుకుందాం. ఇరాన్ లో ఒక ప్రముఖ VFX కంపెనీ నుండి వర్క్ సమయానికి డెలివరీ చేయకపోవడం తో జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, సెన్సార్ కార్యక్రమాలకు కూడా మొదటి కాపీ ని పంపారు. ఈ నెల 8న తిరుపతి లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi),సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) లను ముఖ్య అతిథులుగా కూడా పిలిచారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అర్జీలు కూడా సమర్పించారు. కానీ చివరకు ఇరాన్ నుండి రావాల్సిన వర్క్ రాకపోవడం, మరో వారం రోజుల సమయం కోరడంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది.
కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు VFX ఆధారిత సినిమాల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, మంచు విష్ణు ‘కన్నప్ప’, ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రాలు కూడా VFX కారణంగానే వాయిదా పడ్డాయి. రాజమౌళి సినిమాలకు చాలా తేలికగా అయ్యే ఈ VFX పనులు మిగిలిన సినిమాలకు ఎందుకు అవ్వడం లేదు?, అనుభవ లోపం వల్లనేనా?, సమయానికి వర్క్ ని రాబట్టుకునే బాధ్యత డైరెక్టర్ మీదనే ఉంటుంది. పైన ప్రస్తావించిన సినిమాలన్నిటికీ కొత్త డైరెక్టర్స్ అవ్వడం విశేషం. వీళ్లకు VFX మీద అంత పట్టు లేకపోవడం వల్లనే సమయానికి ప్రోడక్ట్ డెలివరీ అవ్వడం లేదు అనేది విశ్లేషకుల నుండి వినిపిస్తున్న వాదన. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ డైరెక్టర్ గా కొనసాగి ఉండుంటే నేడు VFX విషయం లో ఇంత జాప్యం జరిగి ఉండేది కాదని, సమయానికి అన్నీ సమకూరేవి అని అంటున్నారు.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
అయితే ఇప్పుడు క్రిష్(Krish Jagarlamudi) మళ్ళీ ఈ సినిమా కోసం వచ్చి పని చేస్తాడా?, VFX వర్క్ పూర్తి అయ్యేవరకు తన సహాయ సహకారాలు అందిస్తాడా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం ఆయన అనుష్క తో ‘ఘాటీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెల 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి క్రిష్ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. నిర్మాత AM రత్నం గట్టిగా రిక్వెస్ట్ చేస్తే పని కావొచ్చేమో చూడాలి. ఇరాన్ నుండి VFX వర్క్ మొత్తం ఈ నెల 10న డెలివరీ చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ రోజున VFX వర్క్ డెలివరీ అవ్వకపోతే ఇక డైరెక్టర్ క్రిష్ ని నేరుగా రంగం లోకి దించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.