Krish Ghaati: మన టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకులలో ఒకరు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi). ‘గమ్యం’ సినిమాతో మొదలైన అతని ప్రయాణం, ఘాటీ వరకు కొనసాగింది. ఆయన సినీ జర్నీ ని ఒకసారి పరిశీలిస్తే కథలు అద్భుతంగా ఉంటాయి, కానీ దానిని వెండితెర మీద ఆవిష్కరించే తీరు రిచ్ గా ఉండదు. ఎదో చాలీ చాలని బడ్జెట్ తో లాగించేస్తున్నట్టుగా అనిపిస్తాది. అంతే కాదు ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే కూడా చాలా నత్త నడకన సాగుతుంటాయి. ఇవే అతనిలో పెద్ద మైనస్సులు. అందుకే ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా భారీ హిట్ ని అందుకోలేకపొయాడు. అయితే ఆయన లేటెస్ట్ చిత్రం ‘ఘాటీ'(Ghaati Movie) టీజర్ ని చూసిన తర్వాత, అబ్బో ఈ చిత్రానికి క్రిష్ డైరెక్టర్ నా?, ఆయనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా, మొత్తానికి మారిపోయాడు, ఇక వరుసగా హిట్స్ కొడుతాడు అని అనుకున్నారు అందరూ.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
కానీ నేడు విడుదల చేసిన ‘ఘాటీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే, ఆయన పాత సినిమాల టేకింగ్ స్టైల్ అడుగడుగునా కనిపిస్తూ వచ్చింది. దీనిని చూసి నెటిజెన్స్ ఈయన ఇంకా ఏమి మారలేదు, ఈ సినిమా కూడా ఎత్తిపోయినట్టే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో ఆయన డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా గొప్పగా ఆకర్షించలేదు. ఇలా అయితే ఇక క్రిష్ ఎప్పటికి కమర్షియల్ గా సక్సెస్ అవుతాడు అనేదే ప్రశ్న. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ సినిమా ఫస్ హాఫ్ మొత్తానికి ఆయనే దర్శకత్వం వహించాడు, ఆ తర్వాత షూటింగ్ కి భారీ గ్యాప్ రావడం తో ఎదురు చూడలేక ‘ఘాటీ’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు.
అది కాసేపు పక్కన పెడితే ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ హాఫ్ ని చూస్తే సన్నివేశాలు, సందర్భాలు చాలా అద్భుతంగా రాసుకున్నాడు అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. కానీ విజువల్ గా ప్రెజెంట్ చేయడం లో విఫలం అయ్యాడు. ఉదాహరణకు ఆ సినిమాలో కుస్తీ ఫైట్ సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశాన్ని వేరే మాస్ డైరెక్టర్ కి ఇచ్చి ఉండుంటే రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ ఔట్పుట్ ఇచ్చేవాడు. చాలా నీరసంగా తీసినట్టు అనిపించింది. అదే విధంగా చార్మినార్ ఫైట్ సెటప్ కూడా అద్భుతం,కానీ ఇక్కడ కూడా సరిగా కంపోజ్ చేయలేకపోయాడు. ఇవే వైఫల్యాలు ప్రతీ సినిమాలో కనిపిస్తూనే ఉన్నాయి. ‘ఘాటీ’ చిత్రం క్రిష్ కెరీర్ మనుగడ కి చివరి అవకాశం అనుకోవచ్చు. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇక డైరెక్టర్ క్రిష్ తో మీడియం రేంజ్ సినిమాలు తీసే హీరోలు కూడా అవకాశాలు ఇవ్వరు.