https://oktelugu.com/

Anushka : అనుష్క నటిస్తున్న ‘ఘాటి ‘ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన క్రిష్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఆ హీరోలందరికీ దీటుగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటి అనుష్క... అరుంధతి సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2024 / 05:25 PM IST

    The release date of Anushka's 'Ghati'

    Follow us on

    Anushka :  ఇక ఎన్టీయార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది అదే మొదటిసారి కావడం విశేషం… ఇక ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత భారీ సక్సెస్ లో సాధించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు వెలుగొందింది… ఇక బాహుబలి లాంటి సినిమాలో సైతం నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్కకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మంచి నటి గా పేరు సంపాదించుకుంది. ఇక బాహుబలి సినిమా తర్వాత ఆమె పెద్దగా సినిమాలను చేయడం లేదు. మరి మొత్తానికైతే ఒకప్పుడు ఆమె చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంది. సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె ఏమాత్రం సినిమాలను చేయకుండా ఖాళీగానే ఉంటుంది. ఇక ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఘాటి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ని వదిలారు. అందులో అనుష్క చాలా వైల్డ్ గా కనిపించింది. ఇక అనుష్క ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అనుష్క తన పూర్వ వైభవాన్ని దక్కించుకోబోతుంది అంటూ ఆమె అభిమానులు నమ్ముతారు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా అనుష్కకి గాని క్రిష్ కి గాని ఎలాంటి పేరు రాబోతుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది…

    అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు అయితే లేరు. మరి ఆమె లేని లోటును తీర్చడానికి మళ్లీ ఆమె ఈ ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ కొంతమంది అనుష్క అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఘాటీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా అనుష్క క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేయబోతుందనేది వాస్తవం అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…