https://oktelugu.com/

Chicken : క్రిస్మస్, సంక్రాంతి.. పండుగ సమయం.. మాంసం ముక్క దొరకడం కష్టమేనట..

కొన్ని రోజలు మినహా దాదాపు చికెన్ ధరలు తక్కువగానేఉంటున్నాయి. అయితే కోడి గుడ్డు ధర మాత్రం అమాంతం పెరిగింది. గుడ్డు అందనంత ఎత్తుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అయితే కొన్ని జనవరిలో సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదెలాగంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : December 15, 2024 / 05:47 PM IST

    Chicken Price

    Follow us on

    Chicken :  వీకెండ్ వచ్చిందంటే కొందరికి నాన్ వెజ్ లేకుండా భోజనం ఉండదు. వారంతపు రోజైన ఆదివారం కచ్చితంగా చికెన్ లేదా మటన్ ఉండాలని అనుకుంటారు. మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది చికెన్ కొనేందుకు ప్రిపరెన్స్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. శ్రావణ మాసం మొదలు కార్తీక మాసం వరకు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. దీంతో మాంసకృతుల ధరలు నార్మల్ గా ఉంటూ వస్తున్నాయి. కొన్ని రోజలు మినహా దాదాపు చికెన్ ధరలు తక్కువగానేఉంటున్నాయి. అయితే కోడి గుడ్డు ధర మాత్రం అమాంతం పెరిగింది. గుడ్డు అందనంత ఎత్తుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అయితే కొన్ని జనవరిలో సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదెలాగంటే?

    ఆయా ప్రాంతాను భట్టి చికెన్ ధరలు ఉంటున్నాయి. ఓవరాల్ గా కిలో చికెన్ ను రూ. 200తో విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.240 వరకు అమ్ముతున్నారు. తెలంగాణలో చికెన్ ధరల విషయానికొస్తే.. హైదరాబాద్ లో స్కిన్ లెస్ చికెన్ రూ.210, విత్ స్కిన్ రూ.170, బోన్ లెస్ చికెన్ రూ.220తో విక్రయిస్తున్నారు. వరంగల్ లో స్కిన్ లెస్ చికెన్ రూ.200, విత్ స్కిన్ రూ.160, బోన్ లెస్ చికెన్ రూ.210 ధర ఉంది. సుగుణ కంపెనీకి చెందిన చికెన్ కిలో రూ.210, వెన్ కాబ్ చికెన్ రూ.210 తో విక్రయిస్తున్నారు. అయితే వచ్చే జనవరి నుంచి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు ఆరు నెలల పాటు చికెన్ ధరలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ జనవరి నుంచి రేట్లు అధికంగా ఉంటాయని అంటున్నారు.

    చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నా.. కోడిగుడ్డు ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం ఒక గుడ్డు ధర రూ.7లకు అమ్ముతున్నారు. ఇప్పటికే కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో కోడిగుడ్డు ధర కూడా అధికం కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు కోడిగడ్ల ధరలో మిగతా రాష్ట్రాల్లో కంటే తక్కువగ ఉండేది. ఆ సమయంలో ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ ను పిలిచే వారు. కానీ ప్రస్తుతం మిగతా రాష్ట్రాల్లో కంటే ఉమ్మడి ఏపీలోని ధరలు ఎక్కువగా ఉన్నాయి. బిహార్, ఒడిశా, యూపీ రాష్ట్రాల్లో సబ్సిడీ ఇవ్వడంతో అక్కడ ధరలు తగ్గాయి. అయితే గుడ్ల ఉత్పత్తికి ధరలు పెరగడంతోనే కోడిగుడ్డు ధరలు పెంచాల్సి వచ్చిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

    కానీ కోడి గుడ్డు ధర ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. 2020 సంవత్సరంలో రూ.5.95 తో విక్రయించారు. 2023లో రూ.6.20 ఉండగా.. ప్రస్తుతం రూ.7.50తో విక్రయిస్తున్నారు. ముందు ముందు వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది గానీ.. తగ్గడం కష్టమేనని కొందరు అంటున్నారు. అయితే గుడ్డు ధర పెరగడంతో వాటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎగ్ తో ఎగ్ పప్, తదితర పదార్థాలను తయారు చేస్తారు. ఎగ్ రేటు పెరగడంతో కొందరు ఇప్పటికే వాటి ధరలు పెంచేశారు. వీటి భారం వినియోగదారులపైనే వేస్తున్నారు.