Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం లో మిగతావాళ్ళు ఎలా స్పందించినా, వైసీపీ పార్టీ శ్రేణులు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులను జైలుకు తీసుకొని పొయ్యినంత రేంజ్ లో బాధపడుతూ స్పందిస్తున్న సంఘటనలను గత రెండు మూడు రోజులుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు , ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేసాడు. ఇదంతా నిజంగా బాధపడి, అల్లు అర్జున్ మీద సానుభూతి చూపించి ఉండుంటే అంత బాగానే ఉంటుంది. కానీ వైసీపీ పార్టీ అల్లు అర్జున్ ని రాజకీయంగా వాడుకొని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఎందుకు కలవడానికి రాలేదు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేసాడు.
అంతే కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఒకప్పుడు మంచి సన్నిహితుడు, గురువు కాబట్టి, ఆయన ఇచ్చే ఆదేశాల కారణంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసాడని, ట్విట్టర్ లో నిందలు వేసాడు. ఇక్కడే అందరికీ అర్థమైంది, కేవలం ఈ ఘటనని రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలుస్తాడని వార్తలు వినిపించాయి కానీ, వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ఛాన్స్ ని వైసీపీ పార్టీ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. నిన్నటి నుండి అల్లు అర్జున్ ని టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వచ్చి కలవడం ని మనమంతా చూసాము. పలువురు రాజకీయ నాయకులు కూడా కలిశారు.
ఇప్పుడు మాజీ సీఎం జగన్ కూడా అల్లు అర్జున్ ని కలిసి సంఘీభావం వ్యక్తం చేయబోతున్నాడని వైసీపీ సోషల్ మీడియా సర్కిల్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటి వరకు మీడియా కి సమాచారం రాలేదు కానీ, ఒకవేళ కలిస్తే మాత్రం అది పెద్ద సంచలనమే అని చెప్పొచ్చు. కేవలం శిల్పా రవి ని కలిసినందుకే అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ నెగటివిటీ ఏర్పడింది. ఇక పవన్ కళ్యాణ్ ని, చిరంజీవి ని ముప్పుతిప్పలు పెట్టిన జగన్ ని అల్లు అర్జున్ కలిస్తే మాత్రం ఇక జీవితం లో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని క్షమించరు. రాజకీయ లబ్ది కోసం, పవన్ కళ్యాణ్ ని నెగటివ్ చేయడం కోసం, జగన్ కలిసినా కలుస్తాడు. వచ్చి కలుస్తాను అన్నవాళ్లను రావొద్దు వెళ్ళిపో అని చెప్పలేరు కదా ఎవరైనా, కాబట్టి అల్లు అర్జున్ కి ఇది నిస్సహాయత పరిస్థితి, దీనిని అభిమానులు గమనించాలి.